AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎన్నికలున్నాయి.. వాయిదా వేయండి

నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో జరుగుతున్న విచారణను మరికొన్ని రోజులు వాయిదా వేయాలని యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సుప్రీం కోర్టుకు విన్నవించారు. ఈ కేసు విచారణను గతంలో సుప్రీంకోర్టు ఏప్రిల్‌ 23కు వాయిదా వేసింది. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నందున విచారణను మరికొన్ని రోజులు వాయిదా వేయాలని వారు శుక్రవారం సుప్రీంను కోరారు. కాగా 2011-2012 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నేషనల్‌ హెరాల్డ్‌, యంగ్‌ ఇండియా సంస్థల పన్ను రీ-అసెస్‌మెంట్‌ చేయాలని […]

ఎన్నికలున్నాయి.. వాయిదా వేయండి
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 05, 2019 | 5:05 PM

Share

నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో జరుగుతున్న విచారణను మరికొన్ని రోజులు వాయిదా వేయాలని యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సుప్రీం కోర్టుకు విన్నవించారు. ఈ కేసు విచారణను గతంలో సుప్రీంకోర్టు ఏప్రిల్‌ 23కు వాయిదా వేసింది. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నందున విచారణను మరికొన్ని రోజులు వాయిదా వేయాలని వారు శుక్రవారం సుప్రీంను కోరారు.

కాగా 2011-2012 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నేషనల్‌ హెరాల్డ్‌, యంగ్‌ ఇండియా సంస్థల పన్ను రీ-అసెస్‌మెంట్‌ చేయాలని కోరుతూ ఆయా సంస్థలకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. ఆ సంస్థల్లో ప్రధాన వాటాదారులుగా ఉన్న సోనియా, రాహుల్ ఆ నోటీసులను సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే పన్ను ప్రొసీడింగ్స్‌ను తిరిగి తెరిచే అధికారం ఐటీ శాఖకు ఉందని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేస్తూ, వారు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో ఈ నోటీసులను సవాలు చేస్తూ రాహుల్‌ సుప్రీంను ఆశ్రయించారు. కాగా ఈ సంస్థల లావాదేవీల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ప్రముఖ న్యాయవాది, బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి 2012లో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

Follow Us
తెలివైన భర్తకు పిసినారి పెళ్ళాం... సంసారంలో శాంతికి అదే ముఖ్యం!
తెలివైన భర్తకు పిసినారి పెళ్ళాం... సంసారంలో శాంతికి అదే ముఖ్యం!
ఛోటా ప్యాకెట్‌తో సిరాజ్‌ మాటల యుద్ధం.. మధ్యలో తెలుగోడి ఎంట్రీ
ఛోటా ప్యాకెట్‌తో సిరాజ్‌ మాటల యుద్ధం.. మధ్యలో తెలుగోడి ఎంట్రీ
పారిశుద్ధ్య కార్మికురాలిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులు!
పారిశుద్ధ్య కార్మికురాలిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులు!
పెళ్లి, సంతానం, సొంతింటి కోరికలు నెరవేరుతాయట.. ఈ వరాహస్వామి ఆలయం
పెళ్లి, సంతానం, సొంతింటి కోరికలు నెరవేరుతాయట.. ఈ వరాహస్వామి ఆలయం
కలెక్టర్ జాబ్ వదిలేసి సినిమాల్లోకి.. ఫస్ట్ మూవీకే జాతీయ అవార్డ్..
కలెక్టర్ జాబ్ వదిలేసి సినిమాల్లోకి.. ఫస్ట్ మూవీకే జాతీయ అవార్డ్..
శాసనసభ గొడవపై తాటా మధు వివరణ..
శాసనసభ గొడవపై తాటా మధు వివరణ..
హాట్ కాఫీ + ప్రోటీన్ పౌడర్.. తాగొచ్చా? అసలు విషయం ఏంటంటే!
హాట్ కాఫీ + ప్రోటీన్ పౌడర్.. తాగొచ్చా? అసలు విషయం ఏంటంటే!
బిగ్‌బాస్ మొదటి వారం నామినేషన్స్‌లో ఉన్న కంటెస్టెంట్స్ వీళ్లే!
బిగ్‌బాస్ మొదటి వారం నామినేషన్స్‌లో ఉన్న కంటెస్టెంట్స్ వీళ్లే!
డబ్బు, ఉద్యోగం, వ్యాపారం.. ఈ నక్షత్రాలకు గోల్డెన్ టైమ్ స్టార్ట్
డబ్బు, ఉద్యోగం, వ్యాపారం.. ఈ నక్షత్రాలకు గోల్డెన్ టైమ్ స్టార్ట్
స్థానిక ఎన్నికలే అసలు పరీక్ష.. టీడీపీ ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు
స్థానిక ఎన్నికలే అసలు పరీక్ష.. టీడీపీ ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు