చంద్రబాబుకు షాక్: పార్టీ వీడుతానన్న మరో ఎమ్మెల్యే..!
నేనూ పదవికి రాజీనామా చేస్తానంటూ.. మరో టీడీపీ ఎమ్మెల్యే ప్రకటించారు. ఇప్పటికే కేశినేని నాని.. పార్టీ నుంచి బయటికి వెళ్లాలా.. వద్దా అంటూ.. మధ్యలో ఊగీసలాడుతున్నారు. ఆయన దారిలోనే మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా వెళ్తున్నారు. తాజాగా.. మీడియాతో మాట్లాడిన ఆయన ఇలాంటి సంచలన ఆరోపణలు చేశారు. టీడీఎల్పీ ఉపనేత పదవికి రాజీనామా చేస్తానని.. కానీ ఆ పదవిని బీసీ నేతలకు ఇవ్వాలనేది నా అభిప్రాయమని.. ఈ విషయంపై మాజీ సీఎం, టీడీపీ అధినేత […]
నేనూ పదవికి రాజీనామా చేస్తానంటూ.. మరో టీడీపీ ఎమ్మెల్యే ప్రకటించారు. ఇప్పటికే కేశినేని నాని.. పార్టీ నుంచి బయటికి వెళ్లాలా.. వద్దా అంటూ.. మధ్యలో ఊగీసలాడుతున్నారు. ఆయన దారిలోనే మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా వెళ్తున్నారు. తాజాగా.. మీడియాతో మాట్లాడిన ఆయన ఇలాంటి సంచలన ఆరోపణలు చేశారు. టీడీఎల్పీ ఉపనేత పదవికి రాజీనామా చేస్తానని.. కానీ ఆ పదవిని బీసీ నేతలకు ఇవ్వాలనేది నా అభిప్రాయమని.. ఈ విషయంపై మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుతో చర్చిస్తానని అన్నారు. అలాగే.. పార్టీలో..ఓడిపోయినా వారికే పెత్తనాలు ఇస్తున్నారని.. తెల్ల ఏనుగులను పక్కన పెట్టాలని సంచలన కామెంట్స్ చేశారు.
కాగా.. అలాగే.. సీనియర్లు నాయకులు ఇప్పటికైనా తప్పుకుని.. యువతకు ప్రాధాన్యం ఇస్తే.. పార్టీ మళ్లీ పుంజుకుంటుందని అన్నారు. నేను ఇప్పటికే ఆరు దఫాలుగా ఎమ్మెల్యేగా విజయం సాధించానని ఇక.. వచ్చే ఎన్నికల్లో నేను పార్టీకి దూరంగా ఉంటానని ప్రకటించారు. గోరంట్ల చౌదరి ప్రకటనతో టీడీపీలో కలకలం మొదలైంది. కాగా.. టీడీపీ పార్టీ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయిందంటే.. నాయకులు సక్రమంగా ప్రజలకు ప్రభుత్వ కార్యక్రమాలను తీసుకెళ్లలేకపోయారని అందుకే పార్టీ ఓటమిపాలు కావాల్సి వచ్చిందని అభిప్రాయపడ్డారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి.