లోక్‌సభ బరిలో మీరా కుమార్

తాజాగా  కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ బరిలో పోటీ చేసే 12 మంది సభ్యుల జాబితాను ప్రకటించింది.  ఈ జాబితాలో బీహర్ నుంచి నలుగురు, ఒడిషా నుంచి ఏడుగురు, ఉత్తరప్రదేశ్‌ నుంచి ఒకరికి అవకాశం కల్పించింది ఏఐసీసీ. కాగా లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ బీహర్‌లోని ససరామ్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఆమె ఐదు సార్లు పార్లమెంట్ సభ్యురాలిగా పనిచేశారు. లోక్‌సభ స్పీకర్‌గా ఎలాంటి పోటీలేకుండా ఎన్నికయ్యారు. 1970లో ఇండియన్ ఫారెన్ సర్వీస్‌లో చేరి […]

  • Ram Naramaneni
  • Publish Date - 12:13 pm, Fri, 29 March 19
లోక్‌సభ బరిలో మీరా కుమార్

తాజాగా  కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ బరిలో పోటీ చేసే 12 మంది సభ్యుల జాబితాను ప్రకటించింది.  ఈ జాబితాలో బీహర్ నుంచి నలుగురు, ఒడిషా నుంచి ఏడుగురు, ఉత్తరప్రదేశ్‌ నుంచి ఒకరికి అవకాశం కల్పించింది ఏఐసీసీ.

కాగా లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ బీహర్‌లోని ససరామ్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఆమె ఐదు సార్లు పార్లమెంట్ సభ్యురాలిగా పనిచేశారు. లోక్‌సభ స్పీకర్‌గా ఎలాంటి పోటీలేకుండా ఎన్నికయ్యారు. 1970లో ఇండియన్ ఫారెన్ సర్వీస్‌లో చేరి చాలా దేశాల్లో దౌత్యవేత్తగా పనిచేశారు. 1985లో రాజకీయాల్లోకొచ్చారు. రాం విలాస్ పాశ్వాన్, మాయావతి లాంటివారిని ఓడించి… లోక్‌సభలో అడుగుపెట్టారు. యూపీఏ హయాంలో మంత్రిగా సేవలిందించారు. తొలి మహిళా స్పీకర్‌గా ఎన్నికై రికార్డ్ సృష్టించారు. దళిత వర్గానికి చెందిన నేతగా మీరా కుమార్‌కు మంచి పేరుంది.