కాంగ్రెస్‌ ఆఫర్‌ ను తిరస్కరించిన మాజీ ప్రధాని

న్యూఢిల్లీ : త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ విముఖంగా ఉన్నట్టు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. పంజాబ్ లోని అమృత్ సర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్ అమర్ సింగ్ తో పాటు, కాంగ్రెస్ సీనియర్లు అభ్యర్థించినప్పటికీ… ఆయన సున్నితంగా తిరస్కరించినట్టు తెలుస్తోంది. రెండు సార్లు ప్రధానిగా పని చేసిన మన్మోహన్… ఆ రెండు సార్లు రాజ్యసభ నుంచే ప్రాతినిథ్యం వహించారు. 2009లో […]

కాంగ్రెస్‌ ఆఫర్‌ ను తిరస్కరించిన మాజీ ప్రధాని
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 11, 2019 | 2:05 PM

న్యూఢిల్లీ : త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ విముఖంగా ఉన్నట్టు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. పంజాబ్ లోని అమృత్ సర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్ అమర్ సింగ్ తో పాటు, కాంగ్రెస్ సీనియర్లు అభ్యర్థించినప్పటికీ… ఆయన సున్నితంగా తిరస్కరించినట్టు తెలుస్తోంది. రెండు సార్లు ప్రధానిగా పని చేసిన మన్మోహన్… ఆ రెండు సార్లు రాజ్యసభ నుంచే ప్రాతినిథ్యం వహించారు.

2009లో అమృత్ సర్ నుంచి పోటీ చేసే అవకాశం వచ్చినప్పటికీ… అనారోగ్య కారణాలతో పోటీ చేయలేదు. 2014 సాధారణ ఎన్నికల్లో అమృత్‌సర్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరపున అమరీందర్‌ సింగ్‌ పోటీ చేసి గెలిచారు. అయితే 1991 నుంచి అసోం నుంచి మన్మోహన్‌ సింగ్‌ రాజ్యసభ సభ్యునిగా కొనసాగుతున్నారు. మన్మోహన్‌ రాజ్యసభ పదవీ కాలం ఈ ఏడాది జూన్‌ 14తో ముగియనుంది. ఇప్పటి వరకు మన్మోహన్‌ లోక్‌సభకు ఎన్నిక కాలేదు. 1999లో కాంగ్రెస్‌ తరపున దక్షిణ ఢిల్లీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు మన్మోహన్‌ సింగ్‌.