వైసీపీలో కీలక పదవి దక్కించుకున్న నార్నె శ్రీనివాసరావు

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన జూనియర్‌ ఎన్టీఆర్‌ మామయ్య (లక్ష్మీప్రణతి తండ్రి) నార్నే శ్రీనివాసరావుకు కీలక పదవి దక్కింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు నార్నె శ్రీనివాసరావును పార్టీ కేంద్ర పాలక మండలి (సీజీసీ) సభ్యునిగా నియమించారు. పార్టీలో చేరిన కొద్దిరోజులకే కీలక పదవి దక్కడం ఆనందంగా ఉందన్నారు నార్నె శ్రీనివాసరావు. ఫిబ్రవరి 28న వైసీపీలో చేరిన నార్నె శ్రీనివాసరావు పదేళ్లగా వైఎస్ కుటుంబంతో తాను సన్నిహితంగా ఉన్నానని తెలిపారు. వైసీపీలో […]

వైసీపీలో కీలక పదవి దక్కించుకున్న నార్నె శ్రీనివాసరావు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 11, 2019 | 3:28 PM

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన జూనియర్‌ ఎన్టీఆర్‌ మామయ్య (లక్ష్మీప్రణతి తండ్రి) నార్నే శ్రీనివాసరావుకు కీలక పదవి దక్కింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు నార్నె శ్రీనివాసరావును పార్టీ కేంద్ర పాలక మండలి (సీజీసీ) సభ్యునిగా నియమించారు. పార్టీలో చేరిన కొద్దిరోజులకే కీలక పదవి దక్కడం ఆనందంగా ఉందన్నారు నార్నె శ్రీనివాసరావు.

ఫిబ్రవరి 28న వైసీపీలో చేరిన నార్నె శ్రీనివాసరావు పదేళ్లగా వైఎస్ కుటుంబంతో తాను సన్నిహితంగా ఉన్నానని తెలిపారు. వైసీపీలో చేరడానికి జూనియర్ ఎన్టీఆర్‌కు సంబంధం లేదని, తాను ఏ సీటూ ఆశించడం లేదన్నారు. ఒకవేళ జగన్ ఆదేశిస్తే ఎన్నికల్లో పోటీచేస్తానన్నారు నార్నె శ్రీనివాసరావు.