తొందరపడొద్దంటూ రాయపాటికి లోకేశ్ ఫోన్

విజయవాడ: గుంటూరు జిల్లా నరసారావు పేట లోక్‌సభ నియోజకవర్గం, సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గం విషయంలో టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు అలకబూనారు. పార్టీ మారేందుకు కూడా ఆయన సిద్ధమయ్యారు. తనకంటే సమర్దులు ఉన్నారని టీడీపీ భావిస్తే అందుకు తాను సిద్ధమేనని అన్నారు. ఈ నేపథ్యంలో పరిస్థితిని చక్కబెట్టేందుకు మంత్రి నారా లోకేశ్ రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. స్వయంగా రాయపాటికి ఫోన్ చేసి తొందరపడొద్దని, తగిన న్యాయం జరుగుతుందని చెప్పారట. లోకేశ్‌తో పాటు మాజీ కేంద్ర మంత్రి సుజనా […]

  • Vijay K
  • Publish Date - 4:46 pm, Thu, 14 March 19
తొందరపడొద్దంటూ రాయపాటికి లోకేశ్ ఫోన్

విజయవాడ: గుంటూరు జిల్లా నరసారావు పేట లోక్‌సభ నియోజకవర్గం, సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గం విషయంలో టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు అలకబూనారు. పార్టీ మారేందుకు కూడా ఆయన సిద్ధమయ్యారు. తనకంటే సమర్దులు ఉన్నారని టీడీపీ భావిస్తే అందుకు తాను సిద్ధమేనని అన్నారు. ఈ నేపథ్యంలో పరిస్థితిని చక్కబెట్టేందుకు మంత్రి నారా లోకేశ్ రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది.

స్వయంగా రాయపాటికి ఫోన్ చేసి తొందరపడొద్దని, తగిన న్యాయం జరుగుతుందని చెప్పారట. లోకేశ్‌తో పాటు మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి, మాజీ విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌లు కూడా రంగంలోకి దిగి రాయపాటితో చర్చలు జరుపుతున్నారు. దీంతో రాయపాటి వెనక్కి తగ్గి టీడీపీ అధిష్టానం మాట వింటారా లేక ఏదైనా సంచలన నిర్ణయం తీసుకుంటారా? అనేది ఆసక్తిగా మారింది.