AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వైసీపీలో చేరిన దాసరి నారాయణ రావు కుమారుడు

హైదరాబాద్: వైసీపీ పార్టీలో చేరుతున్న నాయకులతో లోటస్ పాండ్ కోలాహలంగా మారుతోంది. గత కొన్ని రోజులుగా పలువురు నాయకులు వైసీపీలో చేరుతున్నారు. అందులో సినీ ప్రముఖులు ఎక్కువగా ఉన్నారు. ప్రముఖ దర్శక నిర్మాత దివంగత దాసరి నారాయణరావు కుమారుడు దాసరి అరుణ్ ఏ పార్టీలో చేరతారనే విషయం కూడా ఈ క్రమంలో ఆసక్తిగా మారింది. ఇందుకు తెరదించుతూ దాసరి అరుణ్ వైసీపీలో చేరారు. లోటస్ పాండ్‌లో జగన్‌ను కలిసిన ఆయన్ను జగన్ పార్టీ కండువా కప్పి ఆహ్వానం […]

వైసీపీలో చేరిన దాసరి నారాయణ రావు కుమారుడు
Vijay K
|

Updated on: Mar 14, 2019 | 5:07 PM

Share

హైదరాబాద్: వైసీపీ పార్టీలో చేరుతున్న నాయకులతో లోటస్ పాండ్ కోలాహలంగా మారుతోంది. గత కొన్ని రోజులుగా పలువురు నాయకులు వైసీపీలో చేరుతున్నారు. అందులో సినీ ప్రముఖులు ఎక్కువగా ఉన్నారు. ప్రముఖ దర్శక నిర్మాత దివంగత దాసరి నారాయణరావు కుమారుడు దాసరి అరుణ్ ఏ పార్టీలో చేరతారనే విషయం కూడా ఈ క్రమంలో ఆసక్తిగా మారింది.

ఇందుకు తెరదించుతూ దాసరి అరుణ్ వైసీపీలో చేరారు. లోటస్ పాండ్‌లో జగన్‌ను కలిసిన ఆయన్ను జగన్ పార్టీ కండువా కప్పి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా అరుణ్ మాట్లాడుతూ పార్టీ సిద్ధాంతాలు నచ్చి తాను వైసీపీలో చేరానని అన్నారు. పార్టీ అధ్యక్షుడు జగన్ ఆదేశిస్తే వైసీపీ తరుపున ప్రచారం చేస్తానని వెల్లడించారు.