నామినేషన్ దాఖలు చేసిన కోట్ల సుజాతమ్మ

నామినేషన్ దాఖలు చేసిన కోట్ల సుజాతమ్మ

ఎమ్మెల్యే స్థానానికి కోట్ల సుజాతమ్మ నామినేషన్‌ను దాఖలు చేశారు. టీడీపీ తరఫున ఆలూరు నుంచి కోట్ల సుజాతమ్మ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తుండగా.. భారీ సంఖ్యలో కార్యకర్తలు, జనంతో కలిసి వెళ్లిన ఆమె తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. కాగా ఇటీవలే కాంగ్రెస్‌ను వీడి టీడీపీలో చేరిన కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కుటుంబానికి రెండు సీట్లను ఖరారు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డికి కర్నూల్ ఎంపీ స్థానాన్ని, సుజాతమ్మకు […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Mar 23, 2019 | 11:49 AM

ఎమ్మెల్యే స్థానానికి కోట్ల సుజాతమ్మ నామినేషన్‌ను దాఖలు చేశారు. టీడీపీ తరఫున ఆలూరు నుంచి కోట్ల సుజాతమ్మ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తుండగా.. భారీ సంఖ్యలో కార్యకర్తలు, జనంతో కలిసి వెళ్లిన ఆమె తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. కాగా ఇటీవలే కాంగ్రెస్‌ను వీడి టీడీపీలో చేరిన కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కుటుంబానికి రెండు సీట్లను ఖరారు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డికి కర్నూల్ ఎంపీ స్థానాన్ని, సుజాతమ్మకు ఆలూరు ఎమ్మెల్యే స్థానాన్ని కేటాయించారు. వీరిద్దరి గెలుపు ఖాయమని కోట్ల అనుచరులు, పార్టీ కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu