మిర్యాలగూడ సభలో కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

మిర్యాలగూడ సభలో కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

దమ్ముంటే రండి అంటూ సవాల్.. మోడీపై విమర్శల వర్షం నువ్వేమి పీకినవ్ లక్ష్మణ్ సర్జికల్ స్ట్రైక్‌లో చీమ కూడా చావలేదట అది నిజమైన హిందుత్వం కాదు మిర్యాలగూడ: నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఎన్నికల ప్రచారం సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని మోడీ, బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. దేశ ప్రధానమంత్రి పచ్చి అబద్ధాలు మాట్లాడొచ్చునా అని ప్రశ్నించారు. దమ్ముంటే రండి అంటూ సవాల్.. మనల్ని చూసే […]

Vijay K

| Edited By: Pardhasaradhi Peri

Apr 05, 2019 | 5:28 PM

  • దమ్ముంటే రండి అంటూ సవాల్..
  • మోడీపై విమర్శల వర్షం
  • నువ్వేమి పీకినవ్ లక్ష్మణ్
  • సర్జికల్ స్ట్రైక్‌లో చీమ కూడా చావలేదట
  • అది నిజమైన హిందుత్వం కాదు

మిర్యాలగూడ: నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఎన్నికల ప్రచారం సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని మోడీ, బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. దేశ ప్రధానమంత్రి పచ్చి అబద్ధాలు మాట్లాడొచ్చునా అని ప్రశ్నించారు.

దమ్ముంటే రండి అంటూ సవాల్.. మనల్ని చూసే నరేంద్ర మోడీ గారు ఆయుష్మాన్ భారత్ అనే పథకం తెచ్చారు. తాను ముఖం మీదనే ఆ పథకాన్ని తీసుకోనని మోడీకి చెప్పినట్టు కేసీఆర్ అన్నారు. ఆయుష్మాన్ భారత్ కన్నా మన ఆరోగ్య శ్రీ ఎన్నో రెట్లు గొప్పది. ఏది గొప్పదో తేల్చేందుకు ఎవరైనా దమ్మున్నోళ్లు రావొచ్చని సవాల్ విసిరారు. తాను జగదీశ్ రెడ్డిని పెడతానని, దమ్ముంటే రావాలని, ఒట్టి మాటలు మాట్లాడకూడదని అన్నారు.

మోడీపై విమర్శల వర్షం నరేంద్ర మోడీ దేశానికి ప్రధాని అయ్యి ఐదేళ్లు అయ్యిందని, దేశానికి ఏం జరిగిందని కేసీఆర్ అన్నారు. ఒట్టి మాటలు మాత్రమే చేసిందేమీ లేదని విమర్శించారు. రైతులు, దళితులు, గిరిజనులు, మైనార్టీలకు, బీసీలకు చేసిందేమిటి అని ప్రశ్నించారు. కాంగ్రెస్ లేని భారత్ అని మోడీ అంటారు.. మోడీని గద్దె దించుతామని కాంగ్రెస్ అంటారు. ఎవరు గద్దెనెక్కినా ఉపయోగం లేదని కేసీఆర్ విమర్శించారు.

అంతకుముందు ఛాయ్ వాలా అన్నారు, ఇప్పుడు చౌకీదార్ వచ్చింది. అన్ని రాష్ట్రాల్లో బీసీల కోసం మంత్రిత్వ శాఖలున్నాయి. కేంద్రంలో ఎందుకు పెట్టరని మోడీని ప్రశ్నించాను. కానీ పెడచెవిని పెట్టారు. దేశంలో సగానికి సగం ఉన్న బీసీలకు రెండు జాతీయ పార్టీలు ఒక్క పోర్ట్ పోలియో పెట్టలేదని, వాళ్లకు కళ్లు నెత్తికెక్కాయా అని కేసీఆర్ ప్రశ్నించారు. అందుకే దేశంలో గుణాత్మమైన మార్పు రావాలి. ప్రజల బాధ తీరాలంటే ఈ సన్నాసుల పరిపాలనతో తీరదంటూ కేసీఆర్ ఘాటుగా మాట్లాడారు.

నువ్వేమి పీకినవ్ లక్ష్మణ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ కన్నూ మిన్నూ కానకుండా మాట్లాడుతున్నారు. ఎలక్షన్ తర్వాత టీఆర్ఎస్ భరతం పడతానని అన్నారు. బీజేపీ ఎన్డిఏ 150 సీట్లు దాటలేదని, కాంగ్రెస్ 100 సీట్లు దాటడం లేదనే సమాచారం తనకుందని కేసీఆర్ అన్నారు. భారత దేశ పరిపాలన మే 23 తర్వాత ప్రాంతీయ పార్టీల చేతుల్లోకి రాబోతోంది. ప్రాంతీయ పార్టీలే శాశించబోతున్నాయని కేసీఆర్ చెప్పారు. కేసీఆర్‌ను గెలిపిస్తే ఢిల్లీలో గడ్డి కూడా పీకలేనని లక్ష్మణ్ అడుగుతుండు.. నిన్ను గెలిపిచ్చిర్రు మరి నువ్వేమి పీకినవ్ అని కేసీఆర్ అన్నారు.

సర్జికల్ స్ట్రైక్‌లో చీమ కూడా చావలేదట తాను యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు చాలా సర్జికల్ దాడులు జరిగాయని, 11 వరకు జరిగాయని  కేసీఆర్ అన్నారు. అవి వ్యూహాత్మక దాడులు, వాటిని బయటకు చెప్పరు, జరుగుతూనే ఉంటాయి. అలాంటిది నరేంద్ర మోడీ మొన్న సర్జికల్ స్ట్రైక్‌లో 300 మంది చనిపోయారని డొల్ల ప్రచారం చేస్తున్నారు. చీమ కూడా చావలేదని మసూద్ అజహర్ అంటున్నాడని, ఇదేనా మీ ప్రచారం అని కేసీఆర్ ప్రశ్నించారు. ఇదేనా దేశాన్ని నడిపించే పరిస్థితి? అని కేసీఆర్ అన్నారు. దేశంలో పేదరికం సంగతేంది? రైతుల సంగతేంది? గిట్టుబాటు సంగతేంది? ఆర్ధిక పరిస్థితి సంగతేంది? వీటిని పట్టించుకోరా అని కేసీఆర్ ప్రశ్నించారు.

అది నిజమైన హిందుత్వం కాదు మేము హిందువులం కాదా? అసలైన హిందువులం మేమే. వీళ్లు దొంగ హిందువులు అని కేసీఆర్ అన్నారు. ఇతర మతాలను దెబ్బకొట్టాలని చూసేది నిజమైన హిందుత్వం కాదని, ఆ ఒరవడిలో కొట్టుకుని పోవద్దంటూ కేసీఆర్ ఫైరయ్యారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu