బీజేపి జాతీయ నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది. జాతీయ పార్టీ కార్యవర్గంలో తెలుగువారికి కీలక పదవులు దక్కాయి. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా ప్రకటించారు. నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ, నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రత్యేక ఆహ్వానితులు శాశ్వత ఆహ్వానితులు (ఎక్స్ అఫిషియో) లతో జాబితాను వెల్లడించారు. ఇందులో నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఆంధ్రప్రదేశ్ నుండి కన్నా లక్ష్మినారాయణ, తెలంగాణ నుండి కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, మాజీ ఎంపీ జి.వివేక్ వెంకటస్వామి మరో మాజీ ఎంపీ గరికపాటి మోహన్ రావులకు చోటు లభించింది.
ఇదిలావుంటే జాతీయ ఆఫీస్ బేరర్లులలో తెలంగాణ నుంచి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణను నియమించగా.. జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతలను దగ్గుబాటి పురందేశ్వరికి అప్పగించింది. అలాగే ఏపీ నుంచి సత్యకుమార్‌కు జాతీయ కార్యదర్శులలో ఆంధ్రప్రదేశ్ నుండి జాబితాలో చోటు కల్పించింది. ప్రత్యేక ఆహ్వానితులుగా తెలంగాణ నుంచి విజయశాంతి, ఈటెల రాజేందర్‌లకు చోటు లభించింది.
నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో..
ఇక నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో ప్రధాని నరేంద్ర మోడీ, సీనియర్ నాయకులు లాల్ కృష్ణ అద్వానీ, డాక్టర్ మురళి
మనోహర్ జోషి, మాజీ జాతీయ అధ్యక్షులు, కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్ మరియు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, నేషనల్ ఆఫీస్ బేరర్స్‌తో సహా 80 మంది సభ్యులను ఆహ్వానించారు.
జాతీయ కార్యనిర్వాహక కమిటీలో 50 మంది ప్రత్యేక ఆహ్వానితులు… 179 శాశ్వత ఆహ్వానితులు (ఎక్స్ అఫిషియో) ఇందులో ముఖ్యమంత్రులు, డిప్యూటీ ముఖ్యమంత్రులు, అసెంబ్లీ, కౌన్సిల్స్‌లో శాసనసభా పక్ష నాయకులు, మాజీ ముఖ్యమంత్రులు, మాజీ ఉప ముఖ్యమంత్రులు, జాతీయ వక్తలు, జాతీయ మోర్చా ప్రెసిడెంట్స్, స్టేట్ ప్రభారిస్/సాహ్-ప్రభారిస్, స్టేట్అధ్యక్షులు,రాష్ట్ర జనరల్ సెక్రటరీలను సభ్యులగా ప్రకటించారు. యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీ నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఇవి కూడా చదవండి: Converting air to water: కూలర్ ధరకే గాలి నుంచి నీటిని ఉత్పత్తి చేసే మిషన్.. ధర ఎంతో తెలుసా..