భారత్ అంటే హిందీ రాష్ట్రాలే కాదు – బీజేపీకి స్టాలిన్ స్వీట్ వార్నింగ్

ప్రధాని మోదీకి డీఎంకే అధినేత స్టాలిన్ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలలో తమిళనాడులో 38 సీట్లకు గాను డీఎంకే 36 సీట్లు గెలుచుకుని.. డీఎంకే సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే ఇక్కడ బీజేపీ ఖాతా కూడా తెరలేకపోయింది. కేంద్రంలో బీజేపీ బంపర్ మెజార్టీ సీట్లతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. అయితే ఈ సందర్భంగా.. మోదీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి స్టాలిన్ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. కేవలం హిందీ మాట్లాడే రాష్ట్రాలనే […]

భారత్ అంటే హిందీ రాష్ట్రాలే కాదు - బీజేపీకి స్టాలిన్ స్వీట్ వార్నింగ్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: May 25, 2019 | 9:32 PM

ప్రధాని మోదీకి డీఎంకే అధినేత స్టాలిన్ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలలో తమిళనాడులో 38 సీట్లకు గాను డీఎంకే 36 సీట్లు గెలుచుకుని.. డీఎంకే సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే ఇక్కడ బీజేపీ ఖాతా కూడా తెరలేకపోయింది. కేంద్రంలో బీజేపీ బంపర్ మెజార్టీ సీట్లతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. అయితే ఈ సందర్భంగా.. మోదీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి స్టాలిన్ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. కేవలం హిందీ మాట్లాడే రాష్ట్రాలనే మోదీ గుర్తించే రోజులు పోయాయని, ఆ రాష్ట్రాలతోనే దేశం నిర్మితం కాలేదని గుర్తుంచుకోవాలని.. భారత్ అంటే హిందీ రాష్ట్రాలేకాదన్నారు. డీఎంకే శ్రేణులకు రాసిన లేఖలో స్టాలిన్ ఈ విధంగా పేర్కొని అధికారానికి వచ్చిన ఏ పార్టీ అయినా రాష్ట్రాలను నిర్లక్ష్యం చేయరాదనీ, అన్ని వార్గాలను కలుపుకొని మద్దతివ్వాలని పేర్కొన్నారు.