AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎన్నికల తర్వాత కూడా అదే ఫేక్ న్యూస్ !

అదేం ఖర్మో ! లోక్ సభ ఎన్నికల ముందు.. ఆ తరువాత కూడా దేశంలో… సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ వైరల్ అవుతోంది. రెండో సారి ప్రధానిగా మోదీ ఢిల్లీ పీఠం ఎక్కబోతున్నందుకు అనేక చోట్ల బీజేపీ నేతలు, కార్యకర్తలు సెలబ్రేషన్స్ చేసుకోగా..కొంతమంది ఇదే అదననుకుని తప్పుడు (ఫేక్) వార్తల మీద పడ్డారు. లండన్ సిటీ బస్సులపై ‘ వెల్ కమ్ మోదీజీ ‘ అన్న పదాల పోస్టుతో కూడిన ఫోటోను వీరు సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. […]

ఎన్నికల తర్వాత కూడా అదే ఫేక్ న్యూస్ !
Pardhasaradhi Peri
|

Updated on: May 26, 2019 | 12:42 PM

Share

అదేం ఖర్మో ! లోక్ సభ ఎన్నికల ముందు.. ఆ తరువాత కూడా దేశంలో… సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ వైరల్ అవుతోంది. రెండో సారి ప్రధానిగా మోదీ ఢిల్లీ పీఠం ఎక్కబోతున్నందుకు అనేక చోట్ల బీజేపీ నేతలు, కార్యకర్తలు సెలబ్రేషన్స్ చేసుకోగా..కొంతమంది ఇదే అదననుకుని తప్పుడు (ఫేక్) వార్తల మీద పడ్డారు. లండన్ సిటీ బస్సులపై ‘ వెల్ కమ్ మోదీజీ ‘ అన్న పదాల పోస్టుతో కూడిన ఫోటోను వీరు సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. అంటే లండన్ లోనూ మోదీ అభిమానులు ఇలా హల్చల్ చేశారన్నది ఈ పోస్టు సారాంశం. కానీ ఇలాంటి పోస్టులపై నిజ నిర్ధారణ చేసే ‘బూమ్ ‘ సైట్ ఇందులోని వాస్తవాన్ని తెలుసుకుంది.. నిజానికి 2015 లో బ్రిటన్ లోని భారతీయులు ‘ మోదీ ఎక్స్ ప్రెస్ ‘ పేరిట ఓ బస్సును లాంచ్ చేసినప్పటి ఇమేజీలను ఈ ఫేక్ న్యూస్ లో వాడినట్టు వెల్లడైంది. అలాగే… మోదీ మళ్ళీ గెలిచారన్న సంతోషంతో గుజరాత్ కు చెందిన ఓ వ్యక్తి కెనడాలోని మిల్టన్ లో ప్రజలపై కరెన్సీ నోట్లను వెదజల్లాడంటూ ఫేస్ బుక్ లో ఓ వీడియో ప్రత్యక్షమైంది. మోదీ ఘన విజయంతో షేర్ మార్కెట్ భారీగా పుంజుకున్న కారణంగా ఈ వ్యక్తికి పెద్ద ఎత్తున లాభం వచ్చిందన్నక్యాప్షన్ ఈ వీడియోకు జోడించారు. వైరల్ గా అయిన ఈ వీడియో..అసలు .. . అమెరికా… డెట్రాయిట్ లోని ఒకరి ట్విటర్ ఖాతాకు సంబంధించినదని తేలింది. ఒరిజినల్ గా న్యూయార్క్ లో షూట్ చేసిన ఈ వీడియోను..ఇండియాలో ఎన్నికల ఫలితాల వెల్లడికి ముందే అప్ లోడ్ చేశారని, బీజేపీ విజయానికి, దీనికి సంబంధం లేదని నికార్సయిన నిజం బయటికొచ్చింది. ఇలాగే ఎన్నికల ఫలితాలు వెల్లడైన ఈ నెల 23 న మోదీ తన తల్లి దగ్గరకు వెళ్లి ఆమె ఆశీస్సులు తీసుకున్నారనే వీడియో వైరల్ అయింది. కానీ ‘ ఆల్ట్ న్యూస్ ‘ చెకింగ్ సైట్ కథనం ప్రకారం.. ఇది 2014 నాటిదని తెలిసింది. ఇంకో ఫేక్ న్యూస్.. మోదీ మళ్ళీ ఈ దేశ ప్రధాని అయితే తాను దేశాన్ని వదిలి వెళ్తానంటూ బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ గతంలో (2018 ఏప్రిల్ ఫూల్స్ నాడు) చేసిన కామెంట్ ను వక్రీకరించి తాజాగా పోస్ట్ చేశారని కూడా స్పష్టమైంది. ఇలాగే ఇంకా ఎన్నో అవాస్తవిక, తప్పుడు పోస్టులు సోషల్ మీడియాలో వెల్లువెత్తాయి. బహుశా మోదీ అభిమానులే ఆనందం పట్టలేక వీటిని పోస్ట్ చేసి ఉండవచ్చునని భావిస్తున్నారు.

Follow Us
లవ్ బర్డ్స్ తాట తీసిన నరేష్.. ఒక్కో ప్రశ్నతో ఏకిపారేశాడుగా..
లవ్ బర్డ్స్ తాట తీసిన నరేష్.. ఒక్కో ప్రశ్నతో ఏకిపారేశాడుగా..
టీమిండియా వైస్ కెప్టెన్ తిలక్ వర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
టీమిండియా వైస్ కెప్టెన్ తిలక్ వర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
మాసీ సీఎం మమతా బెనర్జీపై హత్యాయత్నం.. క్లారిటీ ఇచ్చిన పోలీసులు!
మాసీ సీఎం మమతా బెనర్జీపై హత్యాయత్నం.. క్లారిటీ ఇచ్చిన పోలీసులు!
నవరాత్రుల నాలుగో రోజు మహా చండీదేవి అలంకారంలో కనకదుర్గ..
నవరాత్రుల నాలుగో రోజు మహా చండీదేవి అలంకారంలో కనకదుర్గ..
ఓటీటీలో దుమ్మురేపుతున్న థ్రిల్లర్ డ్రామా..
ఓటీటీలో దుమ్మురేపుతున్న థ్రిల్లర్ డ్రామా..
ఎప్పటికీ ఎవరూ బ్రేక్ చేయలేని సచిన్ ఆ 3 రికార్డులు ఇవే
ఎప్పటికీ ఎవరూ బ్రేక్ చేయలేని సచిన్ ఆ 3 రికార్డులు ఇవే
దసరా రోజు జమ్మిఆకులను ఎందుకు పంచుకుంటారు..దీని వెనక రహస్యం తెలుసా
దసరా రోజు జమ్మిఆకులను ఎందుకు పంచుకుంటారు..దీని వెనక రహస్యం తెలుసా
హైదరాబాద్‌లో భారత్-విండీస్ పోరు.. వైభవ్‌ కి చోటు దక్కుతుందా ?
హైదరాబాద్‌లో భారత్-విండీస్ పోరు.. వైభవ్‌ కి చోటు దక్కుతుందా ?
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. 2,721 పోస్ట్‌లతో నోటిఫికేషన్
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. 2,721 పోస్ట్‌లతో నోటిఫికేషన్
ఆ హీరోతో ఎక్కువ సినిమాలు ఎందుకు చేశానంటే.. హీరోయిన్ రోజా..
ఆ హీరోతో ఎక్కువ సినిమాలు ఎందుకు చేశానంటే.. హీరోయిన్ రోజా..