బ్రేకింగ్: టీపీసీసీ బాధ్యతల నుంచి తప్పుకోబోతున్నా
టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక నిర్ణయం ప్రకటించారు. కొద్ది రోజుల్లో పీసీసీ అధ్యక్ష బాధ్యతల నుంచి తాను తప్పుకోబోతున్నట్లు ఆయన వెల్లడించారు. హుజూర్‌నగర్ సమావేశంలో ఆయన తన నిర్ణయాన్ని స్పష్టం చేశారు. సొంత నియోజకవర్గానికి సమయం కేటాయించలేకపోతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా హుజూర్‌నగర్, కోదాడ ప్రజలకు అందుబాటులో ఉంటానని ఉత్తమ్ చెప్పుకొచ్చారు. అయితే 2015లో టీపీసీసీ చీఫ్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఇక ఈ మధ్య కాలంలో తెలంగాణలో […]
టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక నిర్ణయం ప్రకటించారు. కొద్ది రోజుల్లో పీసీసీ అధ్యక్ష బాధ్యతల నుంచి తాను తప్పుకోబోతున్నట్లు ఆయన వెల్లడించారు. హుజూర్‌నగర్ సమావేశంలో ఆయన తన నిర్ణయాన్ని స్పష్టం చేశారు. సొంత నియోజకవర్గానికి సమయం కేటాయించలేకపోతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా హుజూర్‌నగర్, కోదాడ ప్రజలకు అందుబాటులో ఉంటానని ఉత్తమ్ చెప్పుకొచ్చారు.
అయితే 2015లో టీపీసీసీ చీఫ్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఇక ఈ మధ్య కాలంలో తెలంగాణలో కాంగ్రెస్‌కు వరుస ఓటముల నేపథ్యంలో ఆయన ఈ పదవి నుంచి తప్పుకోబోతున్నట్లు పుకార్లు వినిపిస్తూ వచ్చాయి. ఈ క్రమంలో ఆ పదవి కోసం అరడజనుకు పైగా నేతలు పోటీ పడుతున్నట్లు ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. వీరిలో ముఖ్యంగా మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకరెడ్డి, శాసనసభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క, పార్టీ సీనియర్ నేతలు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొన్నాల లక్ష్మయ్య, వీహెచ్ తదితర నేతలు కూడా పీసీసీ చీఫ్ పదవిని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికిప్పుడు బాధ్యతల నుంచి తప్పుకోవడం వల్ల కొత్త సమస్యలు వస్తాయని భావించిన కాంగ్రెస్ హైకమాండ్.. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు పూర్తయ్యే వరకు ఈ పదవిలో కొనసాగాలని ఆయనను కోరినట్లు సమాచారం.