‘ఎర్రమంజిల్ అసెంబ్లీ’ యోచనకు హైకోర్టు బ్రేక్: వాట్‌ నెక్ట్స్?

'ఎర్రమంజిల్ అసెంబ్లీ' యోచనకు హైకోర్టు బ్రేక్: వాట్‌ నెక్ట్స్?

తెలంగాణ కొత్త అసెంబ్లీ నిర్మాణం, ఎర్రమంజిల్ భవనాల కూల్చివేత ప్రతిపాదనలపై హైదరాబాద్‌లో పెద్ద రగడే జరింగింది. ప్రస్తుతమున్న అసెంబ్లీ సరిపోవడం లేదని.. కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. వెంటనే దీనిపై మంత్రి మండలి ఏర్పాటు చేసి.. చకచకా నిర్ణయాలు తీసుకున్నారు. కొత్త అసెంబ్లీ నిర్మాణం కోసం అనువైన స్థలాలను ఎంపిక చేసేందుకు.. ఎర్రమంజిల్‌లోని నిజాం కాలం నాటి భవనాలను చెక్‌ చేసి, కాలం చెల్లిన వీటిని కూల్చివేయాలని తీర్మానించింది. అనుకుందే తనువుగా.. ఆచరణలోకి వెళ్లింది. కొత్త అసెంబ్లీ […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Sep 18, 2019 | 12:16 PM

తెలంగాణ కొత్త అసెంబ్లీ నిర్మాణం, ఎర్రమంజిల్ భవనాల కూల్చివేత ప్రతిపాదనలపై హైదరాబాద్‌లో పెద్ద రగడే జరింగింది. ప్రస్తుతమున్న అసెంబ్లీ సరిపోవడం లేదని.. కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. వెంటనే దీనిపై మంత్రి మండలి ఏర్పాటు చేసి.. చకచకా నిర్ణయాలు తీసుకున్నారు. కొత్త అసెంబ్లీ నిర్మాణం కోసం అనువైన స్థలాలను ఎంపిక చేసేందుకు.. ఎర్రమంజిల్‌లోని నిజాం కాలం నాటి భవనాలను చెక్‌ చేసి, కాలం చెల్లిన వీటిని కూల్చివేయాలని తీర్మానించింది. అనుకుందే తనువుగా.. ఆచరణలోకి వెళ్లింది. కొత్త అసెంబ్లీ నిర్మాణానికి కేసీఆర్ భూమి పూజ కూడా చేశారు. నిజాం ప్రభువులు కట్టించిన ఈ భవనాలు వందల ఏళ్ల నాటివి కావడంతో.. వాటి స్థానంలో కొత్త అసెంబ్లీ కట్టాలని తెలంగాణ సర్కారు భావించింది. 400 కోట్లతో హుస్సేన్ సాగర్‌ వద్ద సెక్రటేరియట్ భవనాన్ని, 100 కోట్లతో ఎర్రమంజిల్‌ అసెంబ్లీ భవనాన్ని నిర్మించాలని ప్రభుత్వం యోచించింది.

కాగా.. ఈ వివాదంపై.. ప్రతిపక్షాలు ఒకేసారి భగ్గుమన్నాయి. మా సలహా అయినా తీసుకోకుండా.. మమ్మల్ని అడకుండా.. టీఆర్ఎస్‌ ఇలా.. ఏక ధోరణి నిర్ణయాలు తీసుకోవడం పనికి రాదని మీడియా ముందు తీవ్ర ఆగ్రహాన్ని వెలిగక్కారు కాంగ్రెస్ నేతలు. అంతేకాకుండా.. అసెంబ్లీ ముందు నోటికి నల్లబ్యాడ్జిలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. అయినా తెలంగాణ ప్రభుత్వం స్పందించలేదు. దీంతో.. కాంగ్రెస్ నేతలతో సహా 22 స్వచ్ఛంధ సంస్థలు, ప్రభుత్వ ప్రతిపాదనను సవాలు చేస్తూ.. తెలంగాణ హైకోర్టుకెక్కాయి. 150 ఏళ్ల చరిత్ర కలిగిన ఎర్రమంజిల్ ప్యాలెస్‌ కూల్చివేతపై నిజాం వారసులు, ప్రజా సంఘాలు, సామాజిక కార్యకర్తలు తమ వాదనలను వినిపించారు. ఈ పిటిషన్‌లను విచారించిన హైకోర్టు.. మొదట ఇందుకు జీహెచ్‌ఎంసీ అధికారుల అనుమతి తీసుకున్నారా..? అని ప్రశ్నించింది. లేదని టీఎస్ సర్కార్ తరపు న్యాయవాది సమాధానమివ్వగా.. తీసుకుని రావాలని సూచించింది.

అనంతరం కొన్ని రోజులు.. భిన్న వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు.. పురావస్తు ప్రాధాన్యం ఉన్న కట్టడాలను, భవనాలను కూల్చడానికి వీల్లేదని స్పష్టంగా తీర్పునిచ్చింది. అలాగే.. పాత అసెంబ్లీనే వినియోగించుకోవాలని సీఎం కేసీఆర్‌కు సూచించింది. కాగా.. కొత్త అసెంబ్లీ నిర్మాణ నిమిత్తం ఎర్రమంజిల్‌లోని పాత భవనాలను కూల్చోద్దని తాజాగా.. ఆదేశించింది. ప్రజాధనం దుర్వినియోగం అవుతుందన్న పిటిషనర్ల వాదనతో ఏకీభవించిన హైకోర్టు, ఎర్రమంజిల్‌లో అసెంబ్లీ నిర్మించొద్దని రూలింగ్‌ ఇచ్చింది.

ఈ తీర్పుతో కేసీఆర్ ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదని కాంగ్రెస్, బీజేపీ వంటి విపక్షాలు పేర్కొంటున్నాయి. హైకోర్టు తీర్పు దృష్ట్యా ఇక పాత అసెంబ్లీ భవనాన్నే తెలంగాణ ప్రభుత్వం తప్పనిసరిగా వినియోగించుకోవాల్సిన పరిస్థితి. దీంతో.. కేసీఆర్ భవిష్యత్తు కార్యాచరణ ఏమిటన్నది తేలాల్సివుంది. కొత్త అసెంబ్లీ భవన నిర్మాణాన్ని చేస్తారా..? ఒకవేళ నిర్మిస్తే.. ఎక్కడ నిర్మిస్తారు.. అనేది ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

High Court gives shock to CM KCR: What is the next step?

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu