‘జనసేన’కు ట్విట్టర్ షాక్.. భారీగా ఖాతాలు సస్పెండ్

పవన్ కల్యాణ్ పార్టీ జనసేనకు ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్ షాక్ ఇచ్చింది. ఆ పార్టీకి చెందిన దాదాపు 300మంది ట్విట్టర్ ఖాతాలు సస్పెండ్ అయ్యాయి. దీంతో వారు ఆందోళన చేస్తున్నారు. ఈ మేరకు ట్విట్టర్ సంస్థను ప్రశ్నిస్తూ ఆ పార్టీకి చెందిన పలువురు ట్వీట్లు చేస్తున్నారు. ఏ ఉద్దేశ్యంతో ఖాతాలను సస్పెండ్ చేశారని వారు ప్రశ్నిస్తున్నారు. తమ ట్విట్టర్ ఖాతాలను సస్పెండ్ చేయించినంత మాత్రాన జనసేన గొంతు మూగబోదని, 300 మంది ఖాతాలను సస్పెండ్ చేస్తే […]

  • Tv9 Telugu
  • Publish Date - 9:47 am, Wed, 18 September 19
‘జనసేన’కు ట్విట్టర్ షాక్.. భారీగా ఖాతాలు సస్పెండ్

పవన్ కల్యాణ్ పార్టీ జనసేనకు ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్ షాక్ ఇచ్చింది. ఆ పార్టీకి చెందిన దాదాపు 300మంది ట్విట్టర్ ఖాతాలు సస్పెండ్ అయ్యాయి. దీంతో వారు ఆందోళన చేస్తున్నారు. ఈ మేరకు ట్విట్టర్ సంస్థను ప్రశ్నిస్తూ ఆ పార్టీకి చెందిన పలువురు ట్వీట్లు చేస్తున్నారు. ఏ ఉద్దేశ్యంతో ఖాతాలను సస్పెండ్ చేశారని వారు ప్రశ్నిస్తున్నారు. తమ ట్విట్టర్ ఖాతాలను సస్పెండ్ చేయించినంత మాత్రాన జనసేన గొంతు మూగబోదని, 300 మంది ఖాతాలను సస్పెండ్ చేస్తే 3000 కొత్త ఖాతాలు పుట్టుకొస్తాయని వారు ఛాలెంజ్ చేస్తున్నారు.

కాగా సోషల్ మీడియాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఆయన అభిమానులు ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా సేవ్ నల్లమల క్యాంపెయిన్ చేస్తున్నారు. అలాగే వైఎస్ జగన్ ఫెయిల్డ్ సీఎం అనే హ్యాష్‌ట్యాగ్‌తో ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తున్నారు. అయితే సేవ్ నల్లమల క్యాంపెయిన్‌ కారణంగా ట్విట్టర్ తమ ఖాతాలను సస్పెండ్ చేసే అవకాశం లేదని.. కాబట్టి ఇది వైసీపీ పనే కావచ్చని కొందరు జనసేన శ్రేణులు భావిస్తున్నారు. అయితే భారీ ఫాలోవర్లు ఉన్న ఖాతాలు సస్పెండ్ కావడం జనసేనకు తాత్కాలిక దెబ్బ అని అంటున్నారు కొందరు.