Shobha Hymavathi: తెలుగుదేశం పార్టీకి మరో ఎదురుదెబ్బ.. పార్టీకి మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి గుడ్‌బై
విజయనగరం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి రాజీనామా చేశారు. పార్టీలో..
Former TDP MLA Shobha Hymavathi Resigns: విజయనగరం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి రాజీనామా చేశారు. పార్టీలో తగిన గుర్తింపు లేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన హైమావతి.. పార్టీ కోసం కష్టపడుతున్నవారిని పక్కన పెడుతున్నారని ఆగ్రహం వెళ్లగక్కారు. శోభా హైమావతి గతంలో ఎస్. కోట ఎమ్మెల్యేగా పనిచేసిన సంగతి తెలిసిందే. తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలిగా కూడా శోభ పనిచేశారు.
అయితే, ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న పరిణామాలను భరించలేక పార్టీని వీడుతున్నట్లు హైమావతి వివరణ ఇచ్చారు. టీడీపీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన శోభ.. త్వరలోనే వైసీపీలో చేరే కనిపిస్తున్నాయి. ఇప్పటికే శోభా హైమావతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీకి ప్రస్తుతం ఏపీ, తెలంగాణ రెండు చోట్లా ఎదురు దెబ్బలు తగులుతుండటం పరిపాటిగా మారింది.
సాక్షాత్తూ తెలంగాణ పార్టీ అధ్యక్ష పదవికి ఎల్ రమణ ఇటీవల రాజీనామా చేయడం తెలిసిందే. ఇప్పటికే తెలంగాణలో కనుమరుగయ్యే పరిస్థితికి వచ్చిన తెలుగుదేశం పార్టీకి ఈ పరిణామం మరింత ఇబ్బందులకు గురిచేసేదే. అయితే, నేతలు ఎవ్వరు పార్టీ వీడినా తెలుగు దేశం పార్టీకి కార్యకర్తలే పెద్ద బలమని టీడీపీ నేతలు చెబుతున్నారు.