బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరిపై తీవ్ర విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి కొడాలి నాని. గుడివాడలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకుంటున్నారని నాని ఆరోపించారు. గుడివాడకు మంజూరైన ఫ్లై ఓవర్లను నలుగురు వ్యాపారుల కోసం పురంధేశ్వరి అడ్డుకోవడం దారుణమన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఎంపీ వల్లభనేని బాలశౌరి కృషితో మంజూరైన ఫ్లైఓవర్లను అడ్డుకుంటే తీవ్రపరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ముఖ్యమంత్రి జన్మదినం డిసెంబర్ 21న పూర్తిస్థాయి మౌలిక వసతులతో లబ్ధిదారులకు టిడ్కొ ఇల్లు పంపిణీ చేస్తామన్నారు. అభివృద్ధిని అడ్డుకోవద్దన్నారు. వ్యాపార సంస్థల ప్రయోజనాల కోసం ఫ్లైఓవర్ల నిర్మాణంపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అపాయింట్ మెంట్‌ను పురందేశ్వరి అడిగారని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఎంపీ వల్లభనేని బాలశౌరిల కృషితో మంజూరైన ఫ్లైఓవర్ల ను అడ్డుకుంటే తీవ్రపరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
గుడివాడ మీదుగా వెళ్లే అన్ని రైళ్ళను అడ్డుకుంటామన్నారు. పురందేశ్వరి పిచ్చి ప్రయత్నాలు మానుకోవాలని.. గుడివాడ వచ్చి మీటింగ్ పెడితే ఎవరైనా ఫ్లై ఓవర్లు వద్దంటే అప్పుడు క్యాన్సిల్ చేయించండని అన్నారు. పదిమంది కోసం, ఒక పార్టీ ప్రయోజనాల కోసం ఇంత మంది ప్రజలను ఇబ్బంది పెడతారా? అంటూ ప్రశ్నించారు. ఎన్ఠీఆర్ కుమార్తెగా మీకు ఇది కరెక్ట్ కాదన్నారు. .