AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీ-కాంగ్రెస్‌పై బీజేపీ పొలిటికల్ సర్జికల్ స్ట్రైక్..? జేజమ్మ బాటలో మరో 20 మంది..?

న్యూఢిల్లి : తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్‌ షురూ చేసింది బీజేపీ. వేరే పార్టీల్లో ఉన్న అసంతృప్తులకు గాలం వేస్తోంది. ఇప్పటికే మాజీ మంత్రి, కాంగ్రెస్ మహిళా సీనియర్ నేత డీకే.అరుణ కమలం గూటికి చేరుకోగా.. మరికొన్ని పార్టీ నేతలతో కూడా మంతనాలు జరుపుతున్నట్లు తెలెస్తోంది. దాదాపుగా 20 మంది ముఖ్యనేతలతో బీజేపీ చర్చలు జరుపుతున్నారని.. అలాగే అధికార పార్టీ టీఆర్ఎస్‌లో టికెట్ రాని సిట్టింగ్ ఎంపీలతో కూడా బీజేపీ నేతలు టచ్‌లో ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే […]

టీ-కాంగ్రెస్‌పై బీజేపీ పొలిటికల్ సర్జికల్ స్ట్రైక్..? జేజమ్మ బాటలో మరో 20 మంది..?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 20, 2019 | 3:18 PM

Share

న్యూఢిల్లి : తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్‌ షురూ చేసింది బీజేపీ. వేరే పార్టీల్లో ఉన్న అసంతృప్తులకు గాలం వేస్తోంది. ఇప్పటికే మాజీ మంత్రి, కాంగ్రెస్ మహిళా సీనియర్ నేత డీకే.అరుణ కమలం గూటికి చేరుకోగా.. మరికొన్ని పార్టీ నేతలతో కూడా మంతనాలు జరుపుతున్నట్లు తెలెస్తోంది. దాదాపుగా 20 మంది ముఖ్యనేతలతో బీజేపీ చర్చలు జరుపుతున్నారని.. అలాగే అధికార పార్టీ టీఆర్ఎస్‌లో టికెట్ రాని సిట్టింగ్ ఎంపీలతో కూడా బీజేపీ నేతలు టచ్‌లో ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే రేపు సీఎం కేసీఆర్ పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించనున్నారు. అభ్యర్థుల ప్రకటన అనంతరం కీలక పరిణామాలు చోటుచేసుకొనున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇది ఒకరకంగా తెలంగాణపై బీజేపీ పొలిటికల్ సర్జికల్ స్ట్రైక్ చేసినట్లు భావిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్‌లో బలమైన నాయకురాలిగా ఉన్న మాజీమంత్రి డీకే అరుణను బీజేపీ ఆకర్షించడం… రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. డీకే అరుణను మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపాలని ఆ పార్టీ భావిస్తోంది. ఒక్క మహబూబ్ నగర్‌లో మాత్రమే కాదు… తెలంగాణవ్యాప్తంగా కాంగ్రెస్ తరహాలోనే బలమైన అభ్యర్థులను బరిలోకి దింపాలని భావిస్తున్న బీజేపీ… ఇందుకోసం కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తితో ఉన్న పెద్ద నేతలను ఆకర్షించేందుకు ప్రయత్నిన్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే నామినేషన్లకు కొద్దిరోజులకు ముందు అభ్యర్థులను పార్టీలో చేర్చుకుని బరిలో నిలిపితే… ఆ ప్రభావం ఓటర్లపై ఎంతవరకు ఉంటుందన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్సే.

అలర్ట్.. సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి..
అలర్ట్.. సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి..
డిసెంబర్‌ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ సేవలు బంద్‌!
డిసెంబర్‌ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ సేవలు బంద్‌!
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో
కథలో కొత్తదనం లేదు.. ఫస్టాఫ్‌లో ల్యాగ్.. బ్యాడ్ గర్ల్స్‌ రివ్యూ
కథలో కొత్తదనం లేదు.. ఫస్టాఫ్‌లో ల్యాగ్.. బ్యాడ్ గర్ల్స్‌ రివ్యూ
మేష రాశి ఫలితాలు 2026: జూన్ తర్వాత ఆర్థిక పరిస్థితిలో మార్పు..!
మేష రాశి ఫలితాలు 2026: జూన్ తర్వాత ఆర్థిక పరిస్థితిలో మార్పు..!
KVS-NVSలో 15,762 ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా? కీలక అప్‌డేట్‌
KVS-NVSలో 15,762 ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా? కీలక అప్‌డేట్‌
ఫ్రిడ్జ్‌లో ఈ 9 పదార్థాలను అస్సలు నిల్వ చేయొద్దు!
ఫ్రిడ్జ్‌లో ఈ 9 పదార్థాలను అస్సలు నిల్వ చేయొద్దు!
అప్పులు, డిప్రెషన్, ఆందోళన.. అన్నింటికీ కారణం ఈ ఒక్క అలవాటే!
అప్పులు, డిప్రెషన్, ఆందోళన.. అన్నింటికీ కారణం ఈ ఒక్క అలవాటే!
మూగజీవాలూ సైతం పోరుకు సై అన్నాయ్.. వినూత్న నిరసన మర దగ్గరే..
మూగజీవాలూ సైతం పోరుకు సై అన్నాయ్.. వినూత్న నిరసన మర దగ్గరే..
మొన్న ప్రేమదేశం.. నిన్న బేబీ.. ఇప్పుడు పతంక్! కాకపోతే
మొన్న ప్రేమదేశం.. నిన్న బేబీ.. ఇప్పుడు పతంక్! కాకపోతే