ఎలక్షన్ కమిషన్‌కు బ్యాంక్ యూనియన్ విన్నపం

రుణాలు చెల్లింపుల్లో డిఫాల్ట్ అయిన అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ ప్రదేశ్ బ్యాంక్ వర్కర్స్ అసోసియేషన్ ఎన్నికల కమిషన్‌ను కోరింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు కానీ, వారి కుటుంబ సభ్యులకు కానీ ఎలాంటి రుణ ఎగవేతలు లేవని ప్రకటిస్తేనే పోటీకి అనుమతించాలని ఢిల్లీ ప్రదేశ్ బ్యాంక్ వర్కర్స్ అర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ అశ్విని రానా తెలిపారు. లోన్ తీసుకున్న అభ్యర్థులు చెల్లింపుల్లో డిఫాల్ట్ కాలేదని, రుణాలు ఎగ్గొట్టలేదనే అంశాలను […]

ఎలక్షన్ కమిషన్‌కు బ్యాంక్ యూనియన్ విన్నపం
Follow us

| Edited By:

Updated on: Mar 13, 2019 | 3:25 PM

రుణాలు చెల్లింపుల్లో డిఫాల్ట్ అయిన అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ ప్రదేశ్ బ్యాంక్ వర్కర్స్ అసోసియేషన్ ఎన్నికల కమిషన్‌ను కోరింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు కానీ, వారి కుటుంబ సభ్యులకు కానీ ఎలాంటి రుణ ఎగవేతలు లేవని ప్రకటిస్తేనే పోటీకి అనుమతించాలని ఢిల్లీ ప్రదేశ్ బ్యాంక్ వర్కర్స్ అర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ అశ్విని రానా తెలిపారు. లోన్ తీసుకున్న అభ్యర్థులు చెల్లింపుల్లో డిఫాల్ట్ కాలేదని, రుణాలు ఎగ్గొట్టలేదనే అంశాలను వెల్లడించేలా చర్యలు తీసుకోవాలని బ్యాంక్ వర్కర్స్ అసోసియేషన్ ఎన్నికల కమిషన్‌ను కోరింది.

అభ్యర్థులు బ్యాంకులు అందించే ఎన్‌వోసీ పత్రాన్ని సమర్పిస్తేనే ఎన్నికల్లో పోటీకి అనుమతించాలని పేర్కొంది. ఇలా చేస్తేనే రాజకీయ నాయకులు రుణాలు ఎగొట్టకుండా ఉంటారని తెలిపింది. ఈ విషయాలను తెలియజేస్తూ వర్కర్స్ యూనియన్ ఈసీకి ఒక ఈ-మెయిల్ పంపించింది.