లోకేష్ పోటీ చేసే స్థానంపై క్లారిటీ ఇచ్చిన ఏపీ సీఎం

ఎన్నికల పోలింగ్‌ దగ్గరపడుతున్నవేళ అభ్యర్థుల జాబితాపై రాజకీయ పార్టీలు తీవ్ర కసరత్తులు చేస్తున్నాయి. అయితే టీడీపీలో.. ఎక్కడి నుంచి ఎవరి బరిలోకి దింపాలనేదానిపై సీఎం చంద్రబాబు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగానే ఐటీశాఖ మంత్రి నారాలోకేష్ ఈ సారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. అయితే.. ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారో అనే దానిపై అందరికీ ఆసక్తి నెలకొంది. దానిపై క్లారిటీ ఇచ్చారు చంద్రబాబు. లోకేష్ మంగళగిరి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తారని పార్టీ […]

  • Tv9 Telugu
  • Publish Date - 3:00 pm, Wed, 13 March 19
లోకేష్ పోటీ చేసే స్థానంపై క్లారిటీ ఇచ్చిన ఏపీ సీఎం

ఎన్నికల పోలింగ్‌ దగ్గరపడుతున్నవేళ అభ్యర్థుల జాబితాపై రాజకీయ పార్టీలు తీవ్ర కసరత్తులు చేస్తున్నాయి. అయితే టీడీపీలో.. ఎక్కడి నుంచి ఎవరి బరిలోకి దింపాలనేదానిపై సీఎం చంద్రబాబు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగానే ఐటీశాఖ మంత్రి నారాలోకేష్ ఈ సారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. అయితే.. ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారో అనే దానిపై అందరికీ ఆసక్తి నెలకొంది. దానిపై క్లారిటీ ఇచ్చారు చంద్రబాబు. లోకేష్ మంగళగిరి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తారని పార్టీ అధినేత ప్రకటించారు. ముందు విశాఖ నార్త్ నియోజకవర్గాల్లో ఏదో ఒక చోటు నుంచి లోకేష్ బరిలోకి దిగుతారని ప్రచారం జరిగినప్పటికీ చంద్రబాబు మాత్రం గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి లోకేష్ పోటీ చేస్తారని ప్రకటించారు. కాగా.. దీనిపై ఇప్పటికే సీఎం పలు సర్వేలు కూడా నిర్వహించారని సమాచారం.