తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల గడువు

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల గడువు

తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల పర్వం ముగిసింది. ఏపీ, తెలంగాణల్లో ఈనెల 18 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. తొలి నాలుగు రోజుల కంటే 22వ తేదీన భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. అన్ని పార్టీలకు చెందిన ప్రముఖ నేతలంతా దాదాపు అదే రోజు నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారులకు సమర్పించారు. తెలంగాణలో 23, 24 సెలవు రోజు కావడంతో ఎలాంటి నామినేషన్లు దాఖలు కాలేదు. చివరిరోజు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రభుత్వ కార్యాలయాలన్నీ రాజకీయ […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Mar 25, 2019 | 4:27 PM

తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల పర్వం ముగిసింది. ఏపీ, తెలంగాణల్లో ఈనెల 18 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. తొలి నాలుగు రోజుల కంటే 22వ తేదీన భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. అన్ని పార్టీలకు చెందిన ప్రముఖ నేతలంతా దాదాపు అదే రోజు నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారులకు సమర్పించారు. తెలంగాణలో 23, 24 సెలవు రోజు కావడంతో ఎలాంటి నామినేషన్లు దాఖలు కాలేదు. చివరిరోజు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రభుత్వ కార్యాలయాలన్నీ రాజకీయ నేతలతో కిటకిటలాడాయి. అభ్యర్థుల ఊరేగింపులు, కార్యకర్తల కోలాహల నడుమ పండగ వాతావరణం కనిపించింది. అభ్యర్థులు దాఖలు చేసి నామినేషన్లను మంగళవారం ఎన్నికల సంఘం అధికారులు పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 28వరకు గడువుంది. ఆ తర్వాత అభ్యర్థుల తుదిజాబితాను ఎన్నికల సంఘం ప్రకటిస్తుంది.

ప్రధాన పార్టీల తరపున టికెట్ దక్కకపోవడంతో పలువురు నేతలు రెబల్‌గా బరిలోకి దిగారు. వారు పోటీలో ఉంటే అసలుకే ఎసరొస్తుందని భావించిన పార్టీలు…రెబల్స్‌ను బుజ్జగించే పనిలో ఉన్నాయి. ఇక తెలంగాణలోని నిజామాబాద్‌ లోక్‌సభ స్థానానికి భారీగా నామినేషన్లు దాఖలయినట్లు తెలుస్తోంది. 200లకు పైగా నామినేషన్లు వచ్చినట్లు సమాచారం. పసుపు, ఎర్రజొన్నకు మద్దతు ధర కల్పించాలన్న డిమాండ్‌తో ఎన్నికలో బరిలో దిగుతున్నారు రైతులు. తమ సమస్యను జాతీయ స్థాయిలో తీసుకెళ్లేందుకు భారీగా నామినేషన్లు వేశారు. తెలంగాణలో 17 ఎంపీ లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో 25 లోక్‌స్థానాలతో పాటు 175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి విడత కింద జరుగుతున్న ఈ ఎన్నికలకు ఏప్రిల్ 11న పోలింగ్ జరగనుంది. దేశవ్యాప్తంగా ఎన్నికలు పూర్తైన తర్వాత మే 23న ఫలితాలను ప్రకటిస్తారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu