AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీజేపీకి ఈసీ షాక్… పార్టీ థీమ్ సాంగ్‌పై నిషేధం

న్యూఢిల్లీ : బీజేపీ పార్టీకి ఎన్నికల సంఘం ఝలక్ ఇచ్చింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన బీజేపీ నేత, కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో స్వరపరిచిన బీజేపీ థీమ్ సాంగ్‌ను ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈ పాటను ఎక్కడా ప్లే చేయకూడదని ఆదేశించింది. ఈ గీతానికి సంబంధించి ముందస్తు అనుమతులు తీసుకోని కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ వెల్లడించింది. ప్రచార గీతానికి సంబంధించి వారు ఎలాంటి ముందస్తు అనుమతులు తీసుకోలేదు. అలాగే ఈ పాటను ఇప్పటికే వివిధ […]

బీజేపీకి ఈసీ షాక్... పార్టీ థీమ్ సాంగ్‌పై నిషేధం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 07, 2019 | 11:40 AM

Share

న్యూఢిల్లీ : బీజేపీ పార్టీకి ఎన్నికల సంఘం ఝలక్ ఇచ్చింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన బీజేపీ నేత, కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో స్వరపరిచిన బీజేపీ థీమ్ సాంగ్‌ను ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈ పాటను ఎక్కడా ప్లే చేయకూడదని ఆదేశించింది. ఈ గీతానికి సంబంధించి ముందస్తు అనుమతులు తీసుకోని కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ వెల్లడించింది. ప్రచార గీతానికి సంబంధించి వారు ఎలాంటి ముందస్తు అనుమతులు తీసుకోలేదు. అలాగే ఈ పాటను ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో ప్రచారానికి వినియోగిస్తున్నారు. అందుకే దీన్ని నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చామని ఎన్నికల అధికారి సంజయ్‌ బసు తెలిపారు. మీడియా సర్టిఫికేషన్‌ అండ్‌ మానిటరింగ్ కమిటీ నుంచి ముందస్తు అనుమతులు తీసుకోకపోవడం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమేనని స్పష్టం చేశారు. బెంగాల్‌లోని ఆసన్‌సోల్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సుప్రియో కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

అయితే ఈ థీమ్ సాంగ్‌కు సంబంధించి కొన్ని రోజుల క్రితం తృణమూల్‌ కాంగ్రెస్‌ ఈసీ దృష్టికి తీసుకెళ్లింది. ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే సామాజిక మాధ్యమాల్లో గీతాన్ని విడుదల చేశారని ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన ఈసీ.. బాబుల్‌ సుప్రియోకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. అనంతరం ప్రచార గీతానికి సంబంధించిన వివరాలను బీజేపీ ఈసీకి సమర్పించింది. అయితే ఈ గీతానికి సంబంధించి తరవాత చేసిన మార్పులను కూడా ఎన్నికల సంఘం కోరింది. ఇప్పటికీ దానిపై బీజేపీ స్పందించక పోవడంతో ఈ థీమ్‌ సాంగ్‌ను నిలిపివేస్తున్నట్లు ఈసీ వెల్లడించింది.

షూ చూపించడం ఏంటి? వైభవ్ సూర్యవంశీపై బీసీసీఐ సీరియస్!
షూ చూపించడం ఏంటి? వైభవ్ సూర్యవంశీపై బీసీసీఐ సీరియస్!
హీరోయిన్స్ డ్రెస్‌సెన్స్‌పై శివాజీ షాకింగ్ కామెంట్స్
హీరోయిన్స్ డ్రెస్‌సెన్స్‌పై శివాజీ షాకింగ్ కామెంట్స్
జనవరి 1 నుంచి మారనున్న రూల్స్.. ఇవి తెలుసుకోకపోతే ఇబ్బందే
జనవరి 1 నుంచి మారనున్న రూల్స్.. ఇవి తెలుసుకోకపోతే ఇబ్బందే
Video: కీర్తితో కలిసి డ్యాన్స్ అదరగొట్టిన స్టార్ హీరో భార్య..
Video: కీర్తితో కలిసి డ్యాన్స్ అదరగొట్టిన స్టార్ హీరో భార్య..
ఒక్క రాత్రికి 3 కోట్లు.. ఈ భామ బిజినెస్ రేంజ్ మామూలుగా లేదుగా!
ఒక్క రాత్రికి 3 కోట్లు.. ఈ భామ బిజినెస్ రేంజ్ మామూలుగా లేదుగా!
వెయ్యి కోట్లు దాటేసిన క్రేజీ బ్యూటీ.. టాప్ 5లో ఊహించని పేర్లు
వెయ్యి కోట్లు దాటేసిన క్రేజీ బ్యూటీ.. టాప్ 5లో ఊహించని పేర్లు
కూతురు పెళ్లి కబురుతో షాకిచ్చిన సీనియర్​ హీరో.. ఊహించని ట్విస్ట్!
కూతురు పెళ్లి కబురుతో షాకిచ్చిన సీనియర్​ హీరో.. ఊహించని ట్విస్ట్!
సంక్రాంతి స్పెషల్ రైళ్ల షెడ్యూల్స్ వచ్చేశాయి.. వివరాలు ఇవే..
సంక్రాంతి స్పెషల్ రైళ్ల షెడ్యూల్స్ వచ్చేశాయి.. వివరాలు ఇవే..
టెక్నాలజీతో దోస్తీ.. రోబోలతో పోటీ.. మీ పిల్లలను ఇలా రెడీ చేయండి
టెక్నాలజీతో దోస్తీ.. రోబోలతో పోటీ.. మీ పిల్లలను ఇలా రెడీ చేయండి
మంత్రుల సమావేశంలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు!
మంత్రుల సమావేశంలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు!