వయనాడ్‌లో విచిత్ర పరిస్థితి.. రాహుల్ గాంధీపై రాహుల్ గాంధీ పోటీ
తిరువనంతపురం : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న వయనాడ్ లోక్‌సభ స్థానంలో విచిత్రమైన పోటీ నెలకొంది. రాహుల్ గాంధీ నామినేషన్ వేశాక అదే పేరున్న మరో ముగ్గురు అభ్యర్థులు వయనాడ్ బరిలో తలపడటానికి సిద్ధమయ్యారు. కేరళలోని వయనాడ్ పార్లమెంట్ స్థానానికి రాహుల్ నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే లోపు వయనాడ్ స్థానంలో రాహుల్ గాంధీతో పాటు మరో ముగ్గురు గాంధీలు పోటీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. […]

తిరువనంతపురం : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న వయనాడ్ లోక్‌సభ స్థానంలో విచిత్రమైన పోటీ నెలకొంది. రాహుల్ గాంధీ నామినేషన్ వేశాక అదే పేరున్న మరో ముగ్గురు అభ్యర్థులు వయనాడ్ బరిలో తలపడటానికి సిద్ధమయ్యారు. కేరళలోని వయనాడ్ పార్లమెంట్ స్థానానికి రాహుల్ నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే లోపు వయనాడ్ స్థానంలో రాహుల్ గాంధీతో పాటు మరో ముగ్గురు గాంధీలు పోటీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. వారిలో కొట్టాయంలోని ఎరుమెలి గ్రామానికి చెందిన కే.ఈ.రాహుల్ గాంధీ అనే యువకుడు ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేశారు. కే.ఈ.రాహుల్ గాంధీ సంప్రదాయ సంగీతంలో రీసెర్చ్ స్కాలర్. అతడి సోదరుడి పేరు రాజీవ్ గాంధీ కే.ఈ. వారి నాన్న కుంజుమన్ డ్రైవర్, కాంగ్రెస్ కార్యకర్త. గాంధీ కుటుంబానికి అభిమాని అని స్థానికులు చెబుతున్నారు.
ఇక అఖిల భారత మక్కల్ ఖగజం పార్టీకి చెందిన కె.రఘుల్ గాంధీ కూడా రాహుల్‌పై పోటీకి నిలిచారు. ఇతను కోయంబత్తూరుకు చెందినవాడు. వయనాడ్ సమీపానికి చెందిన కేఎమ్ శివప్రసాద్ గాంధీ కూడా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. శివప్రసాద్ సంస్రృత టీచర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. కాగా ఎన్నికల అఫిడవిట్లో తెలిపిన వివరాల ప్రకారం వీరంతా సామాన్య కుటుంబానికి చెందిన వారుగా తెలుస్తోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు పోటీచేస్తుండడంతో కాంగ్రెస్‌తో పాటు వామపక్షాలు కూడా ఈ స్థానాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే.



