‘శబరిమల’ ఇష్యూని ఎన్నికల ప్రచారాంశంగా వాడకండి: ఈసీ
తిరువనంతపురం: కేరళలో శబరిమల ఆలయ అంశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ పార్టీ కూడా ప్రచారానికి వాడకూడదని ఎన్నికల సంఘం (ఈసీ) సోమవారం హెచ్చరించింది. ఇలా చేయడం కచ్చితంగా ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకే వస్తుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి తీకా రామ్ మీనా స్పష్టం చేశారు. తిరువంతపురంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రచారంలో భాగంగా.. శబరిమల ఆలయం, దేవుడి పేరిట మత భావనలను రేకెత్తించడం; సుప్రీంకోర్టు తీర్పును ఏవిధంగానైనా ప్రస్తావించడం; మతం పేరుతో ఓట్లు అడగడం […]
తిరువనంతపురం: కేరళలో శబరిమల ఆలయ అంశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ పార్టీ కూడా ప్రచారానికి వాడకూడదని ఎన్నికల సంఘం (ఈసీ) సోమవారం హెచ్చరించింది. ఇలా చేయడం కచ్చితంగా ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకే వస్తుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి తీకా రామ్ మీనా స్పష్టం చేశారు. తిరువంతపురంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రచారంలో భాగంగా.. శబరిమల ఆలయం, దేవుడి పేరిట మత భావనలను రేకెత్తించడం; సుప్రీంకోర్టు తీర్పును ఏవిధంగానైనా ప్రస్తావించడం; మతం పేరుతో ఓట్లు అడగడం వంటివి చేయరాదని పేర్కొన్నారు. కేరళకు సంబంధించి శబరిమల వివాదాస్పద అంశమని, ఈ విషయమై రాజకీయ పార్టీలు కచ్చితమైన గిరి గీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.