AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Carrot: చలికాలంలో క్యారెట్ తింటే ఏమవుతుంది.. తినేముందు ఇవి పక్కా తెలుసుకోండి..

క్యారెట్ ఆరోగ్యానికి మంచిదని మనందరికీ తెలుసు. కానీ దానిని పచ్చిగా తినడం కంటే వండి తింటేనే 7 రెట్లు ఎక్కువ లాభం ఉంటుందని మీకు తెలుసా? వినడానికి వింతగా ఉన్నా ఇది శాస్త్రీయంగా నిరూపితమైంది. చలికాలంలో విరివిగా దొరికే క్యారెట్లను సరైన పద్ధతిలో తీసుకుంటే కంటి చూపు మెరుగుపడటమే కాకుండా రోగనిరోధక శక్తి కూడా అమాంతం పెరుగుతుంది.

Carrot: చలికాలంలో క్యారెట్ తింటే ఏమవుతుంది.. తినేముందు ఇవి పక్కా తెలుసుకోండి..
Health Benefits Of Carrots In Winter
Krishna S
|

Updated on: Jan 12, 2026 | 9:37 PM

Share

చలికాలం వచ్చిందంటే మార్కెట్లో ఎటు చూసినా తాజా క్యారెట్లు దర్శనమిస్తాయి. కేవలం రుచికరమైనవే కాకుండా క్యారెట్లు ఈ సీజన్‌లో మన శరీరానికి అవసరమైన విటమిన్లు, యాంటీఆక్సిడెంట్ల గని అని చెప్పవచ్చు. అయితే క్యారెట్లను పచ్చిగా తినడం కంటే వండి తింటేనే ఎక్కువ లాభమని పరిశోధనలు చెబుతున్నాయి. క్యారెట్లలో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. అయితే ఇది కొవ్వులో కరిగే విటమిన్. మనం క్యారెట్లను కొంచెం నూనె లేదా నెయ్యితో కలిపి వండినప్పుడు, దానిలోని బీటా-కెరోటిన్ సులభంగా విడుదలవుతుంది. ఫలితంగా పచ్చి క్యారెట్ల కంటే వండిన క్యారెట్ల నుండి మన శరీరం 7 రెట్లు ఎక్కువ విటమిన్ ఏ ని గ్రహిస్తుందని పరిశోధనల్లో తేలింది.

చలికాలంలో క్యారెట్ తో కలిగే 5 అద్భుత ప్రయోజనాలు

రోగనిరోధక శక్తి పెంపు

చలికాలంలో జలుబు, దగ్గు, వైరల్ ఇన్ఫెక్షన్లు సర్వసాధారణం. క్యారెట్‌లోని విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచి, బాక్టీరియాపై పోరాడేలా శరీరాన్ని బలోపేతం చేస్తాయి.

కంటి చూపు మెరుగు

క్యారెట్లలో ఉండే బీటా కెరోటిన్ కంటి చూపును మెరుగుపరుస్తుంది. చలికాలంలో కళ్లు పొడిబారడం వంటి సమస్యలను ఇది సమర్థవంతంగా నివారిస్తుంది.

మెరుగైన జీర్ణక్రియ

ఈ సీజన్‌లో జీర్ణక్రియ నెమ్మదించి మలబద్ధకం వచ్చే అవకాశం ఉంది. క్యారెట్‌లో ఉండే ఫైబర్ కడుపును శుభ్రపరచడంలో, జీర్ణక్రియను క్రమబద్ధీకరించడంలో సహాయపడుతుంది.

చర్మ సౌందర్యం

చలి గాలికి చర్మం పొడిబారి నిర్జీవంగా మారుతుంది. క్యారెట్‌లోని యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని లోపలి నుండి పోషించి, సహజమైన కాంతిని ఇస్తాయి.

బరువు నియంత్రణ

క్యారెట్లలో క్యాలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువ. ఇది తిన్న తర్వాత కడుపు నిండుగా అనిపించి, త్వరగా ఆకలి వేయకుండా చేస్తుంది. తద్వారా శీతాకాలంలో పెరిగే బరువును నియంత్రించవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్