సిద్ధూకూ తప్పని ఈసీ కొరడా

న్యూ ఢిల్లీ : కాంగ్రెస్ నేత, పంజాబ్ మంత్రి నవజోత్ సింగ్ సిద్ధుపై ఎన్నికల సంఘం కొరడా ఝుళిపించింది. మూడు రోజులపాటు ప్రచారం చేయకుండా నిషేధం విధించింది. బీహార్‌లోని కటిహార్‌లో గతవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో సిద్ధు మాట్లాడుతూ.. ముస్లింలు ఓట్లు చీల్చవద్దని కోరారు. ముస్లిం సోదరులకు ఒక విషయం చెప్పదలిచానని.. అసదుద్దీన్ ఒవైసీ వంటి నేతలను ఇక్కడికి తీసుకొచ్చి మిమ్మల్ని విభజించాలని కొందరు చూస్తున్నారని సిద్ధు అన్నారు. కొత్త పార్టీ పెట్టి మిమ్మల్ని విడగొట్టి, విజయం […]

  • Tv9 Telugu
  • Publish Date - 7:51 am, Tue, 23 April 19
సిద్ధూకూ తప్పని ఈసీ కొరడా

న్యూ ఢిల్లీ : కాంగ్రెస్ నేత, పంజాబ్ మంత్రి నవజోత్ సింగ్ సిద్ధుపై ఎన్నికల సంఘం కొరడా ఝుళిపించింది. మూడు రోజులపాటు ప్రచారం చేయకుండా నిషేధం విధించింది. బీహార్‌లోని కటిహార్‌లో గతవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో సిద్ధు మాట్లాడుతూ.. ముస్లింలు ఓట్లు చీల్చవద్దని కోరారు. ముస్లిం సోదరులకు ఒక విషయం చెప్పదలిచానని.. అసదుద్దీన్ ఒవైసీ వంటి నేతలను ఇక్కడికి తీసుకొచ్చి మిమ్మల్ని విభజించాలని కొందరు చూస్తున్నారని సిద్ధు అన్నారు. కొత్త పార్టీ పెట్టి మిమ్మల్ని విడగొట్టి, విజయం సాధించాలని చూస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. ఇక్కడ ముస్లిం జనాభా 65 శాతం ఉందని, అందరూ ఐక్యంగా ఉండడం వల్ల మైనారిటీలు మెజారిటీగా ఉండొచ్చని పేర్కొన్నారు. అదే జరిగితే మోదీ ఓటమి పాలవుతారని ఆయన అన్నారు. సిద్ధు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి మాట్లాడారంటూ ఈ నెల 16న ఈసీకి బీజేపీ ఫిర్యాదు చేసింది. దాంతో సిద్ధు వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన ఈసీ.. 72 గంటలపాటు ప్రచారం చేయకుండా నిషేధం విధించింది.