ఎన్నికల్లో ‘పంచ్’ ఇస్తా: విజేందర్
ఇన్ని రోజులు బాక్సింగ్ రింగ్‌లో ప్రత్యర్థులపై పంచ్‌లు విసిరిన ప్రముఖ బాక్సర్, ఒలింపిక్ విజేత విజేందర్ సింగ్ ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేసేందుకు సై అన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున దక్షిణ ఢిల్లీ లోక్‌సభ స్థానం నుంచి విజేందర్ సింగ్ పోటీ చేస్తున్నారు. ఇందుకోసం తన డీఎస్పీ పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు. విజేందర్ రాజీనామాను ఆమోదించినట్లు హర్యానా అడిషనల్ సీఎస్ ఎస్ఎస్ ప్రసాద్ తెలిపారు. మరోవైపు తనకు ఈ అవకాశం రావడంపై విజేందర్ సింగ్ […]

ఇన్ని రోజులు బాక్సింగ్ రింగ్‌లో ప్రత్యర్థులపై పంచ్‌లు విసిరిన ప్రముఖ బాక్సర్, ఒలింపిక్ విజేత విజేందర్ సింగ్ ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేసేందుకు సై అన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున దక్షిణ ఢిల్లీ లోక్‌సభ స్థానం నుంచి విజేందర్ సింగ్ పోటీ చేస్తున్నారు. ఇందుకోసం తన డీఎస్పీ పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు. విజేందర్ రాజీనామాను ఆమోదించినట్లు హర్యానా అడిషనల్ సీఎస్ ఎస్ఎస్ ప్రసాద్ తెలిపారు.
మరోవైపు తనకు ఈ అవకాశం రావడంపై విజేందర్ సింగ్ ట్విట్టర్‌లో కాంగ్రెస్‌కు ధన్యవాదాలు తెలిపారు. ‘‘20ఏళ్ల బాక్సింగ్ కెరీర్‌లో దేశం తలెత్తుకునేలా చేశాను. ఇప్పుడు ఈ దేశానికి ఇంకా ఏదో చేయాల్సి ఉంది. నాకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవకాశాన్ని అంగీకరిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్‌కు, పార్టీ అధినేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీకి ధన్యవాదాలు’’ అంటూ ట్వీట్ చేశారు. కాగా 2008 బీజింగ్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో విజేందర్ సింగ్ కాంస్య పతకం సాధించారు. ఈ పతకం సాధించిన తొలి భారత బాక్సర్ విజయేందర్ అన్న విషయం తెలిసిందే.