బుద్ధి ఉన్నవారు బీజేపీలో చేరరు..!
కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శనంలో శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకున్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ ఉండగా, బీజేపీలోకి వెళ్తే నన్నేమీ ప్రధానమంత్రిని చేయరు కదా..! అని ఎద్దేవా చేశారు. నేను బీజేపీలోకి వెళ్తున్నట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమన్నారు. బుద్ధి ఉన్నవాడు బీజేపీలో చేరరు.. చిల్లర ప్రచారాలు నమ్మవద్దని కోరుతున్నానని చెప్పారు. ప్రజల సమస్యలపై పార్లమెంటులో నా బాధ్యత నేరవేరుస్తానన్నారు. రాష్ట్రంలో, కేంద్రంలో ప్రజాకాంక్షలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న […]
కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శనంలో శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకున్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ ఉండగా, బీజేపీలోకి వెళ్తే నన్నేమీ ప్రధానమంత్రిని చేయరు కదా..! అని ఎద్దేవా చేశారు. నేను బీజేపీలోకి వెళ్తున్నట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమన్నారు. బుద్ధి ఉన్నవాడు బీజేపీలో చేరరు.. చిల్లర ప్రచారాలు నమ్మవద్దని కోరుతున్నానని చెప్పారు. ప్రజల సమస్యలపై పార్లమెంటులో నా బాధ్యత నేరవేరుస్తానన్నారు. రాష్ట్రంలో, కేంద్రంలో ప్రజాకాంక్షలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వారికి జ్ఞానోదయం కలిగించి ప్రజలకు సంక్షేమం అందించాలని శ్రీవారిని కోరుకున్నా అని తెలిపారు ఎంపీ రేవంత్ రెడ్డి.