గుజరాత్ అసెంబ్లీలో ‘టీ షర్ట్’ లొల్లి, స్పీకర్ ఆదేశం, కాంగ్రెస్ ఎమ్మెల్యే సభ నుంచి బయటకి ..

గుజరాత్ అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే విమల్ చుడాశమ ఓ కొత్త సమస్య సృష్టించారు. టీ షర్ట్ ధరించి సభకు వచ్చిన ఆయనను స్పీకర్ రాజేంద్ర తివారీ ..ఇలా రాకూడదంటూ సభ నుంచి నిష్క్రమించాలని ఆదేశించారు.

గుజరాత్ అసెంబ్లీలో 'టీ షర్ట్' లొల్లి, స్పీకర్ ఆదేశం,  కాంగ్రెస్ ఎమ్మెల్యే సభ నుంచి బయటకి ..
Vimal Chudasama

గుజరాత్ అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే విమల్ చుడాశమ ఓ కొత్త సమస్య సృష్టించారు. టీ షర్ట్ ధరించి సభకు వచ్చిన ఆయనను స్పీకర్ రాజేంద్ర తివారీ ..ఇలా రాకూడదంటూ సభ నుంచి నిష్క్రమించాలని ఆదేశించారు. సభ్యుల డ్రెస్ హుందాగా, గౌరవప్రదంగా ఉండాలని, సభకు వచ్చేటప్పుడు వారు షర్టు లేదా కుర్తా ధరించి రావాలని ఆయన సూచించారు.అయితే 40 ఏళ్ళ విమల్.. గతంలో కూడా ఇలావస్తే స్పీకర్ ఆయనను మందలించారు. మళ్ళీ సోమవారం విమల్ ఇలాగె రావడంతో రాజేంద్ర తివారీ ఆగ్రహించారు. టీ షర్ట్ బదులు చొక్కా లేదా కుర్తా ధరించి రావాలన్నారు,. కానీ దీన్ని తిరస్కరించిన విమల్,, తనను ఓటర్లు ఈ టీ షర్ట్ తోనే చూడడానికిఇష్ట పడతారని, దీనితోనే తాను ఎన్నికల ప్రచారం చేసి గెలిచానని అన్నారు. ఇందుకు మండిపడిన రాజేంద్ర తివారీ..ఆయనను సభ నుంచి వెళ్లిపోవాలని ఆదేశించినా ఆయన కదలలేదు. చివరకు స్పీకర్ ఆదేశంతో ముగ్గురు, నలుగురు మార్షల్స్ వచ్చారు. ఇక తనను వారు బలవంతంగా ఎత్తుకుపోతారని భావించిన విమల్ వారివెంట సభ బయటకు నడిచారు.

అయితే కాంగ్రెస్ సభ్యులు స్పీకర్ తీరుపై అభ్యంతరం చెప్పారు. సభ్యులు సభకు వచ్చినా తమ ఇష్టం వచ్చిన డ్రెస్ తో వస్తారని, ఇందులో తప్పేముందని వారు ప్రశ్నించారు. చాలావరకు వారు తమ డ్రెస్ విషయంలో హుందాగానే ప్రవర్తిస్తారని వ్యాఖ్యానించారు.  చివరకు సీఎం విజయ్ రూపానీ జోక్యంతో ఈ వివాదం సద్దు మణిగింది.  చిన్న సమస్యను పెద్దది చేయవద్దని ఆయన పదేపదే కోరారు. మొత్తానికి విమల్ వ్యవహారం కొంతసేపు సభలో నవ్వులు పూయించింది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: మీ డబ్బును తప్పుగా ఇతర ఖాతాలోకి ట్రాన్స్‌ఫర్ చేశారా.? అయితే ఆ మొత్తాన్ని రివర్స్ చేసుకోండిలా.!

మరో సంచలన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైన కేంద్రం.. త్వరలోనే పలు కీలక విమానాశ్రయాలు ప్రైవేటీకరణ..?

 

Click on your DTH Provider to Add TV9 Telugu