CM Revanth Reddy: నేను ఉన్నంత వరకు కేసీఆర్ ఫ్మామిలీకి కాంగ్రెస్‌లోకి ఎంట్రీ ఉందడు- సీఎం రేవంత్ రెడ్డి!
ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి జాతీయ మీడియాలో చేసిన చిట్‌చాట్‌లో కేసీఆర్ కుటుంబంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఉన్నంత కాలం కేసీఆర్ కుటుంబ సభ్యులకు కాంగ్రెస్‌లోకి ప్రవేశం ఉండదని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ కుటుంబమే ప్రధాన శత్రువులని ఆయన విమర్శించారు. ఇవాళ కాళేశ్వరంపై కేసీఆర్ తన అభిప్రాయాన్ని చెప్పారని..తాను కూడా రెండు రోజుల్లో ప్రెస్ మీట్ పెట్టి కాళేశ్వరంపై అన్ని అంశాలను ప్రజలకు వివరిస్తానని సీఎం రేవంత్ అన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. కొత్త మంత్రులకు కేటాయించే శాఖలపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తన దగ్గర ఉన్న శాఖలనే కొత్త మంత్రులకు కేటాయిస్తానని ఆయన తెలిపారు. మంత్రులకు శాఖల కేటాయింపు అంశంపై అధిష్ఠానంతో ఎటువంటి చర్చలు జరగలేదని.. కర్ణాటకలో కులగణన అంశంపై మాత్రమే అధిష్ఠానంతో చర్చించినట్లు రేవంత్ రెడ్డి వివరించారు.
కేసీఆర్ ఫ్యామిలీపై సీఎం రేవంత్ విమర్శలు..
మరోవైపు మాజీ సీఎం కేసీఆర్ ఫ్యామిలీపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్ కుటుంబమే తెలంగాణకు ప్రధాన శత్రువులని ఆయన అన్నారు. తాను ఉన్నంత వరకు కేసీఆర్ కుటుంబ సభ్యులకు కాంగ్రెస్‌లోకి ఎంట్రీ ఉండదని స్పష్టం చేశారు. కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయన్న కవితే ఇవాళ ఆయన వెంట కమిషన్ విచారణకు వెళ్లిందని..కేసీఆర్ చుట్టూ ఉన్న దయ్యాల్లో ఆమె కూడా భాగం అయ్యిందా? అని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఈరోజు కేసీఆర్ తన అభిప్రాయాన్ని చెప్పారని.. రెండు మూడు రోజుల్లో కాళేశ్వరంపై ప్రెస్ మీట్ పెట్టి అన్ని అంశాలను ప్రజలకు వివరిస్తానని ఆయన అన్నారు.
కిషన్ రెడ్డిపై సీఎం రేవంత్ ఆగ్రహం..
ఇదిలా ఉండగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతుంది కిషన్ రెడ్డేనని ఆయన ఆరోపించారు. కిషన్ రెడ్డి తెలంగాణకు ఒక ప్రాజెక్టు కూడా తీసుకురాలేదని విమర్శించారు. తెలంగాణ అభివృద్ధికి కిషన్ రెడ్డి ముందుకు వస్తే వారితో కలిసి వెళ్లేందుకు తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రాజెక్టులపై ప్రధాని మోదీకి కిషన్ రెడ్డి ఏ రోజైనా నివేదిక ఇచ్చారా.. కనీసం తెలంగాణకు ప్రాజెక్టు ఇవ్వాలని డిమాండ్ చేశారా అని ప్రశ్నించారు. కేంద్ర కేబినెట్‌లో ఎప్పుడైనా తెలంగాణ అంశాలను ఆయన ప్రస్తావించారా అని నిలదీశారు. నిర్మల సీతారామన్ చెన్నైకు మెట్రో ట్రైన్‌ను తీసుకువెళ్లారు, ప్రహ్లాద్ కర్ణాటకకు మెట్రో తీసుకెళ్లారు, తెలంగాణ నుంచి కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి రాష్ట్రానికి ఏమి తీసుకువచ్చారని ప్రశ్నించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..