AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాహుల్ నాయనమ్మ నుండి అదే స్లోగన్ – కేసీఆర్

మెదక్ : దేశానికి పట్టిన శని కాంగ్రెస్ – బీజేపీ పార్టీలని అన్నారు సీఎం కేసీఆర్. మెదక్ జిల్లా నర్సాపూర్ లో ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించిన ఆయన కాంగ్రెస్ – బీజేపీ పార్టీలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బ్రిటీషోళ్లు దేశం విడిచి వెళ్లినప్పటి నుండి.. దేశంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందని అన్నారు. బీజేపీ నేతలు కల్లబొల్లి మాటలతో కాలం నెడితే.. కాంగ్రెస్ పార్టీలో అప్పుడున్న రాహుల్ నాయనమ్మ ( ఇందిరా […]

రాహుల్ నాయనమ్మ నుండి అదే స్లోగన్ - కేసీఆర్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 03, 2019 | 8:11 PM

Share

మెదక్ : దేశానికి పట్టిన శని కాంగ్రెస్ – బీజేపీ పార్టీలని అన్నారు సీఎం కేసీఆర్. మెదక్ జిల్లా నర్సాపూర్ లో ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించిన ఆయన కాంగ్రెస్ – బీజేపీ పార్టీలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బ్రిటీషోళ్లు దేశం విడిచి వెళ్లినప్పటి నుండి.. దేశంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందని అన్నారు. బీజేపీ నేతలు కల్లబొల్లి మాటలతో కాలం నెడితే.. కాంగ్రెస్ పార్టీలో అప్పుడున్న రాహుల్ నాయనమ్మ ( ఇందిరా గాంధీ ) నుండి ఇప్పటి రాహుల్ వరకు అదే స్లోగన్‌తో జపం చేస్తున్నారని అన్నారు. ఇక గత ఎన్నికలలో నల్లధనం వెలికితీసి ప్రతి ఒక్కరికి పదిహేను లక్షలు ఇస్తానన్న మోదీ.. ఐదేళ్ల తర్వాత కూడా అదే మాట చెబుతున్నారని విమర్శించారు. ఇక కేంద్ర ప్రభుత్వం మన టీఆర్‌ఎస్ పథకాలను కాపీ కొడుతున్నారని.. ఇంతకు ముందు చాయ్ వాలా.. ఇప్పుడు చౌకీదార్ నినాదం తప్ప మార్పు మాత్రం లేదన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ పుట్టిన దగ్గర నుండి గరీబీ హటావో అంటున్నారని.. ఈ స్లోగన్లతోనే దేశాన్ని నాశనం చేస్తున్నారని  సీఎం కేసీఆర్ అన్నారు.