టీవీ షోలు తప్ప ప్రజలకు ఏం చేసింది?: రోజాపై చంద్రబాబు ఫైర్
పుత్తూరు: చిత్తూరు జిల్లా పుత్తూరులో టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ నాయకురాలు, నగిరి ఎమ్మెల్యే రోజాపై ఫైరయ్యారు. హైదరాబాద్‌లో టీవీ షోలు చేసుకోవడం తప్ప నగిరి ప్రజలకు రోజా ఏం ఉపయోగపడ్డారని ప్రశ్నించారు. ఇలాంటి వ్యక్తులను ఇంటికి పంపించాలని, మళ్లీ పోటీ చేయకుండా చూడాలని ప్రజలను కోరారు. ఆమె నోరు పారేసుకోవడం తప్ప చేసిందేమీ లేదని, ఒక పద్దతీ పాడూ లేదని రోజాపై చంద్రబాబు మండిపడ్డారు. ఆమె […]

పుత్తూరు: చిత్తూరు జిల్లా పుత్తూరులో టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ నాయకురాలు, నగిరి ఎమ్మెల్యే రోజాపై ఫైరయ్యారు. హైదరాబాద్‌లో టీవీ షోలు చేసుకోవడం తప్ప నగిరి ప్రజలకు రోజా ఏం ఉపయోగపడ్డారని ప్రశ్నించారు. ఇలాంటి వ్యక్తులను ఇంటికి పంపించాలని, మళ్లీ పోటీ చేయకుండా చూడాలని ప్రజలను కోరారు. ఆమె నోరు పారేసుకోవడం తప్ప చేసిందేమీ లేదని, ఒక పద్దతీ పాడూ లేదని రోజాపై చంద్రబాబు మండిపడ్డారు.
ఆమె తన ఇష్టానుసారం మాట్లాడినా తానెప్పుడూ పట్టించుకోలేదని అన్నారు. వాళ్ల నాయకుడూ అంతేనంటూ వైసీపీ అధినేత జగన్‌పై కూడా విమర్శలు చేశారు. ఇందిరాగాంధీ, చెన్నారెడ్డి, విజయభాస్కర్ రెడ్డి.. వంటి నాయకులతో తాను పోరాడనని, అలాంటి నన్ను 31 కేసులున్న ఓ నేరచరితుడు మాటలంటాడా అంటూ మండిపడ్డారు.