చంద్రబాబు రెండు వేళ్లు ఎందుకు చూపిస్తారో తెలుసా?: షర్మిళ
గుడివాడ: కృష్ణా జిల్లా గుడివాడలో వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిళ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చంద్రబాబు తన రెండు వేళ్లను ఎందుకు చూపిస్తారో తెలుసా? అని ప్రశ్నిస్తూ విమర్శలు చేశారు. ఆయన రోజుకో మాట మాట్లాడుతూ, పూటకో వేషం వేస్తారని అందుకే తన రెండు వేళ్లను చూపిస్తూ ఉంటారని విమర్శించారు. చంద్రబాబుది రెండు నాల్కల ధోరణి అని అన్నారు. ప్రత్యేక హోదా కోసం జగన్ నిరంతరం పోరాడుతున్నారని, కానీ దాన్ని […]

గుడివాడ: కృష్ణా జిల్లా గుడివాడలో వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిళ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చంద్రబాబు తన రెండు వేళ్లను ఎందుకు చూపిస్తారో తెలుసా? అని ప్రశ్నిస్తూ విమర్శలు చేశారు. ఆయన రోజుకో మాట మాట్లాడుతూ, పూటకో వేషం వేస్తారని అందుకే తన రెండు వేళ్లను చూపిస్తూ ఉంటారని విమర్శించారు. చంద్రబాబుది రెండు నాల్కల ధోరణి అని అన్నారు.
ప్రత్యేక హోదా కోసం జగన్ నిరంతరం పోరాడుతున్నారని, కానీ దాన్ని నీరుగార్చింది మాత్రం చంద్రబాబేనని షర్మిళ అన్నారు. అందుకే ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే చాలని, మళ్లీ ప్రత్యేక హోదా కావాలంటూ మాట మార్చారు. జగన్ కారణంగా చంద్రబాబు మాట మార్చారు. ఈ విషయంలో చంద్రబాబుకు దమ్ముంటే నిజం చెప్పాలని షర్మిళ సవాల్ చేశారు. షర్మిళ ప్రచారంలో గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని పాల్గొన్నారు.