BJP POLITICS: ముఖ్యమంత్రి అభ్యర్థి బీజేపీ నేతే.. ఏపీలో కాక రేపుతున్న సత్యకుమార్ కామెంట్.. నడ్డా వ్యాఖ్యలూ ఆసక్తికరమే!
AP Politics: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విజయవాడ పర్యటన ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపడమే కాకుండా రాజకీయ వర్గాలకు బుర్ర పదును పెట్టాల్సిన అవసరం కల్పించింది.
BJP POLITICS TRIGGERRED POLITICAL TURMOIL IN ANDHRA PRADESH: తెలుగు రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ పొలిటికల్ గేమ్ ప్లాన్ ఆసక్తి రేపుతోంది. తెలంగాణ(Telangana) రాజకీయాల్లో దుమ్ము రేపుతున్న బీజేపీ.. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోను కాక రేపడం మొదలుపెట్టారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) విజయవాడ(Vijayawada) పర్యటన ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపడమే కాకుండా రాజకీయ వర్గాలకు బుర్ర పదును పెట్టాల్సిన అవసరం కల్పించింది. దానికి తోడు ఏపీకి చెందిన జాతీయ కార్యదర్శి సత్యకుమార్(BJP Satya Kumar) సీఎం క్యాండిడేచర్‌పై చేసిన కామెంటు సరికొత్త చర్చకు దారి తీస్తోంది. పొత్తుల గురించి ఆలోచించకుండా పార్టీని విస్తరించే పనులు వేగవంతం చేయండంటూ జేపీ నడ్డా పార్టీ శ్రేణులను ఆదేశించారు. జూన్ ఆరు రాత్రి ఏపీ బీజేపీ కీలక నేతలతో మంతనాలు కొనసాగించిన జేపీ నడ్డా.. పార్టీని మరింత విస్తరించాలని, 46 వేల పోలింగ్ బూతులకు పార్టీ కమిటీలను నియమించాలని నిర్దేశించారు. పొత్తుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదంటూ ఆయన చేసిన కామెంట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఓ పక్క టీడీపీ(TDP), జనసేన(Janasena) పార్టీలు కలుస్తాయన్న ప్రచారం జోరుగా సాగుతుండడం.. దానిపై మరిన్ని ఊహాగానాలకు తావిస్తూ రెండు పార్టీల నేతలు వ్యాఖ్యలు చేస్తుండడం జరుగుతోంది. ఈ క్రమంలో జేపీ నడ్డా తన విజయవాడ పర్యటనలో ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. ఏపీ రాజకీయాల్లో మరింత కాక పెంచారు.
జూన్ 6వ తేదీన జేపీ నడ్డా విజయవాడ Vijayawadaకు వచ్చారు. ముందుగా బీజేపీ శక్తి కేంద్రాల ప్రతినిధుల సదస్సులో ఆయన పాల్గొన్నారు. వైసీపీ YCP ప్రభుత్వం కేంద్ర పథకాలను హైజాక్ చేసి, తమవిగా ప్రచారం చేసుకుంటుందని ఆరోపించారు. అందుకు ఆరోగ్య శ్రీ Arogya Sriపథకాన్ని ఉదాహరణగా పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ Aayushman Bharat పథకం కింద ఇస్తున్న నిధులను ఆరోగ్యశ్రీ అమలుకు డైవర్ట్ చేస్తూ.. క్రెడిట్ కొట్టేసేందుకు వైసీపీ ప్రయత్నిస్తుందని, ఈ అంశాన్ని రాష్ట్ర ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జూన్ ఆరు రాత్రి ఏపీ బీజేపీ ముఖ్య నేతల (కోర్ కమిటీ) సమావేశంలో నడ్డా కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తులపై ఎలాంటి ప్రకటనలు చేయవద్దని ఆయన రాష్ట్ర నేతలకు సూచించారు. ఏ పార్టీతోకలిసి వెళ్ళాలనే విషయం కేంద్ర కమిటీది, పార్లమెంటరీ బోర్డుది అని.. ఆ విషయాన్ని పక్కనపెట్టి పార్టీ విస్తృతిపైన ఫోకస్ చేయాలని ఆయన నిర్దేశించారు. అదేసమయంలో పవన్ కల్యాణ్ తమతో నిరంతరం టచ్‌లో వుంటూ, ముఖ్యవిషయాలను పంచుకుంటున్నారని కూడా నడ్డా కోర్ కమిటీ నేతలకు తెలిపినట్లు సమాచారం. అయితే.. బీజేపీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్ మాత్రం ఓ అడుగు ముందుకేసి చేసిన ప్రకటన అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఏ పార్టీతో పొత్తు వున్నా సీఎం క్యాండిడేట్ CM Candidate బీజేపీకి చెందిన వారే వుంటారంటూ సత్యకుమార్ జనసేన వర్గాలకు షాకిచ్చే కామెంట్ చేశారు. ఓవైపు జనసేన, బీజేపీ కూటమి తరపున సీఎం క్యాండిడేట్ తానే అని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. ఆయన ఈ విషయంలో పైకి ఏమీ మాట్లాడకపోయినా.. జేఎస్పీ వర్గాలు మాత్రం బీజేపీ-జనసేన కూటమి తరపున పవన్ కల్యాణే ముఖ్యమంత్రి అభ్యర్థి అని బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. రాష్ట్రంలో బీజేపీకి పెద్దగా బలం లేదని, జనసేన పార్టీతో కలిస్తేనే బీజేపీ చెప్పుకోదగిన స్థాయిలో సీట్లను గెలుచుకోగలదని జేఎస్పీ వర్గాలు కాస్త గట్టిగానే వాదిస్తున్నారు.
ఇటీవల విరివిగా జిల్లాల పర్యటనలు చేస్తున్న పవన్ కల్యాణ్ Pawan Kalyan గతంలో పొలిటికల్ పొత్తుల కోసం త్యాగాలు చేశామని, ఇకపై తమతో జత కట్టే పార్టీలే త్యాగాలు చేయాల్సి వుందని కామెంట్ చేశారు. ఇది పరోక్షంగా బీజేపీ, టీడీపీలనుద్దేశించేనని జేఎస్పీ వర్గాలంటున్నాయి. సీఎం కావాలంటే కూటమి తరపున ఎక్కువ సీట్లను తామే తీసుకోవాల్సి వుంటుందని పవన్ కల్యాణ్ భావిస్తున్నందువల్లనే ఈ ప్రకటన చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఓవైపు పవన్ వ్యాఖ్యలపైనే పెద్ద చర్చ కొనసాగుతుండగా.. తాజాగా నడ్దా వ్యాఖ్యలు, సత్యకుమార్ కామెంట్లు మరింత కాకరేపుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే వైసీపీకే మరోసారి విజయావకాశాలుంటాయని.. టీడీపీ, బీజేపీ, జేఎస్పీ కలిస్తే యాంటి ఇంకుబెన్సీ ఓటు పోలరైజ్ అయి.. వైసీపీ ఓటమి పాలవుతుందని తెలుగుదేశం పార్టీ అంచనా వేస్తోంది. ఈక్రమంలోనే చంద్రబాబు.. పొత్తులకు తాము సుముఖమంటూనే ‘‘వన్ సైడ్ లవ్’’ కుదరదని.. తాము కలవాలనుకుంటున్న పార్టీలు కూడా తమవైపు రావాలని నర్మగర్భంగా ఆకాంక్షించారు. ఆ వ్యాఖ్యలకు తొలుత సానుకూలంగా స్పందించినట్లే కనిపించారు జనసేనాని. ఆ తర్వాత మాత్రం 3 ఆప్షన్లున్నాయని కామెంట్ చేశారు. టీడీపీ, బీజేపీ, జేఎస్పీలు ఒక కూటమిగా ఎన్నికలకు వెల్లడం అందులో తొలి ఆప్షన్. టీడీపీని పక్కన పెట్టి కేవలం బీజేపీతో మాత్రమే వెళ్ళడం రెండో ఆప్షన్.. ఇక మూడో ఆప్షన్‌గా జనసేన ఒంటరిగా ఎన్నికలకు ఎదుర్కోవడం.. ఈ ఆప్షన్లపై రాజకీయవర్గాల్లో చర్చ కొనసాగుతోంది. ఈ తరుణంలో నడ్డా చేసిన వ్యాఖ్యలు.. సత్యకుమార్ అభిప్రాయం.. చర్చనీయాంశాలుగా మారాయి. ఈ విషయంలో మరీ ముఖ్యంగా సత్యకుమార్ చేసిన కామెంట్‌పై జనసేన నేతలెలా స్పందిస్తారన్నది ఆసక్తి రేపుతోంది. ఇదిలా వుంటే తొలిరోజు విజయవాడలో పర్యటించిన జేపీ నడ్డా రెండో రోజు బెజవాడ కనక దుర్గమ్మ దర్శనం తర్వాత రాజమండ్రిలో జరిగిన పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొన్నారు. మరోవైపు జులై 4వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ Prime Minister Narendra Modi భీమవరం రానున్న నేపథ్యంలో దాన్ని పొలిటికల్‌గా ఎలా వినియోగించుకోవాలా అని ఏపీ బీజేపీ నేతలు చర్చలు జరుపుతున్నారు. భీమవరంలో బహిరంగ సభ ప్లాన్ చేయడమా లేక భారీ ఎత్తున రోడ్ షో నిర్వహించడమా అన్న మీమాంసలో నేతలున్నట్లు తెలుస్తోంది. జులై 2,3 తేదీలలో మోదీ హైదరాబాద్ నగరంలో మకాం వేయనున్నారు. పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలను హైదరాబాద్‌లో నిర్వహించనున్నది బీజేపీ అధిష్టానం. వచ్చే ఏడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణపై మోదీ ముద్ర వేసేందుకు భాగ్యనగరం వేదికగా బీజేపీ కార్యవర్గ సమావేశాలను ప్లాన్ చేశారు. 2,3 తేదీలలో హైదరాబాద్ Hyderabad వుండనున్న మోదీ మర్నాడు అంటే జులై 4వ తేదీన భీమవరం వెళుతున్నారు. ఆయన రాకను సద్వినియోగం చేసుకునేందుకు ఏపీ బీజేపీ కూడా సమాయత్తమవుతోంది. మోదీ పర్యటనలో మిత్ర పక్షం జనసేన తరపున పవన్ కల్యాణ్ పాల్గొంటారా లేదా అన్న చర్చ అప్పుడే ప్రారంభమైంది.