Bandi Sanjay: తెలంగాణలో ఉడ్తా హైదరాబాద్‌ సినిమా తీసే పరిస్థితి.. సీఎం కేసీఆర్‌పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..

డ్రగ్స్‌ దందాపై తీసిన ఉడ్తా పంజాబ్‌ సినిమా మాదిరిగా.. ఉడ్తా హైదరాబాద్‌ సినిమా తీసే పరిస్థితి తెలంగాణలో ఏర్పండిందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు.

Bandi Sanjay:  తెలంగాణలో ఉడ్తా హైదరాబాద్‌ సినిమా తీసే పరిస్థితి.. సీఎం కేసీఆర్‌పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..
Bandi Sanjay
Follow us

|

Updated on: Apr 08, 2022 | 7:40 PM

డ్రగ్స్‌ దందాపై తీసిన ఉడ్తా పంజాబ్‌ సినిమా మాదిరిగా.. ఉడ్తా హైదరాబాద్‌(Udta Hyderabad) సినిమా తీసే పరిస్థితి తెలంగాణలో ఏర్పండిందని బీజేపీ(BJP) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌(Bandi Sanjay) విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పంజాబ్‌లో ప్రభుత్వం కూలిపోయిందంటే డ్రగ్స్‌ దందానే కారణమన్నారు. హైదరాబాద్‌లో ఉన్న యువత తల్లిదండ్రులు తమ పిల్లలు డగ్స్‌ బారిన పడతారేమోనని ఆందోళన చెందుతున్నారని.. డ్రగ్స్‌ తీసుకుంటున్నారని తెలిసి హైదరాబాద్‌లోని సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేసే 15 మంది ఉద్యోగులను తొలగించారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. హైదరాబాద్‌ అడ్డాగా డ్రగ్స్‌ దందా నడుస్తుందో ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరముందని ఎద్దేవ చేశారు.

టీఆర్ఎస్ నేతలు, సీఎం కేసీఆర్‌ సన్నిహితుల హస్తం ఉన్నందునే డ్రగ్స్‌ దందా కొనసాగుతోందని బండి సంజయ్‌ ఆరోపించారు. డ్రగ్స్‌పై సమీక్షల పేరుతో సీఎం కాలయాపన చేస్తున్నారు తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని విమర్శించారు. వెయ్యి మందితో కమిటీ వేసి డ్రగ్స్‌ను నిర్మూలిస్తామని గతంలో ప్రకటించారని.. ఇచ్చిన హామీ ఏమైందో ముఖ్యమంత్రి చెప్పాలని ప్రశ్నించారు.

2015 నాటి డ్రగ్స్‌ కేసు విచారణ మరుగున పడేశారని.. కొందరి పేర్లు లీక్‌ చేసినా ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని గుర్తు చేశారు. ఏ కేసు గురించైనా ముందుగా సీఎం హల్‌చల్‌ చేస్తారు.. ఆ తర్వాత మరుగున పడేస్తారని బండి సంజయ్ ఎద్దేవ చేశారు. డ్రగ్స్‌ కేసు వివరాలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఈడీ లేఖ రాసినా.. రాష్ట్ర సర్కార్ స్పందించలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరించట్లేదని ఈడీ అధికారులు హైకోర్టును ఆశ్రయించిందని బండి సంజయ్‌ గుర్తు చేశారు.

ఇక గవర్నర్‌కు, గవర్నమెంట్‌కు జరుగుతున్న ఇష్యూపై రియాక్ట్‌ అయ్యారు బండి సంజయ్‌. గవర్నర్ తమకు ఏజెంట్‌గా ఉండాలని టీఆర్ఎస్ కోరుకుంటోందన్నారు. గవర్నర్‌ తమిళిసై ఎప్పుడూ రాజకీయాలు మాట్లాడలేదన్నారు బండి సంజయ్‌. నిబంధనలకు విరుద్ధంగా కళ్లు మూసుకుని సంతకాలు చేయాలా అని ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి: Pomegranate Benefits: ఆ వయసులోని మహిళలకు ఇదో బంగారు పండు.. రోజు ఒకటి తింటే చాలు నిత్య యవ్వనమే..

APS RTC: ఏపీఎస్ ఆర్టీసీ సరికొత్త ప్రయోగం.. బస్సుల్లోనే కొరియర్, కార్గో బుకింగ్‌..

Latest Articles
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..