Kodali Nani : ‘టీడీపీని బీజేపీలో విలీనం చేయడానికి చంద్రబాబు చర్చలు.. సింగపూర్, మలేషియా చెక్కేసేందుకు స్కెచ్..’

టీడీపీని బీజేపీలో విలీనం చేయడానికి చంద్రబాబు చర్చలు జరుపుతున్నాడని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఆరోపించారు...

Kodali Nani : 'టీడీపీని బీజేపీలో విలీనం చేయడానికి చంద్రబాబు చర్చలు.. సింగపూర్, మలేషియా చెక్కేసేందుకు స్కెచ్..'
Kodali Nani
Follow us

|

Updated on: Jul 28, 2021 | 5:24 PM

Kodali Nani – Devineni Uma – Chandrababu : తెలుగుదేశం పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి చంద్రబాబు చర్చలు జరుపుతున్నాడని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీని బీజేపీకి అప్పజెప్పి సింగపూర్, మలేషియా పరిపోతాడని ఆయన వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యక్తుల్ని నమ్మి టీడీపీ నాయకులు అల్లర్లు చేయాలని చూస్తే సహించేది లేదని ఆయన వార్నింగ్ ఇచ్చారు. “వాళ్ళు చేసిన తప్పులను, వెన్నుపోటులను పక్క వాళ్లపై నెట్టడం వాళ్ళకి అలవాటు. ఎన్టీఆర్‌ని చెప్పులతో కొట్టింది వాళ్లే.. మళ్లీ ఆయనని పూజిచేది వాళ్లే.. ఆయన పేరు చెప్పి ఓట్లు అడుక్కునేది వాళ్లే. ” అని నాని ఎద్దేవా చేశారు.

ఇవాళ తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మంత్రి కొడాలి నాని.. దేవినేని ఉమ అరెస్టుకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు గోబెల్స్ అయితే, అంతకు మించిన వ్యక్తి దేవినేని ఉమా మహేశ్వరరావు అని నాని అన్నారు. “దేవినేని ఉమ ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్టు అబూత కల్పనలు చేస్తుంటాడు. నిన్న ఉద్దేశ్యపూర్వకంగా వెళ్లి అక్కడి ప్రజలపై దుర్భాషలాడాడు. మా పార్టీ నేత కారు అద్దాలు పగలగొడితే దాన్నే దేవినేని ఉమా కారు అని చూపించారు. దాడి చేయడమే కాకుండా దళితులను దుర్బాషలాడారు. పోలీసులను కూడా బెదిరించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు” అని నాని ఆరోపించారు.

“అక్కడ (మైలవరం నియోజకవర్గ పరిధిలోని కొండపల్లి అటవీ ప్రాంతం) అక్రమంగా మైనింగ్ జరుగుతోందంటూ టీడీపీ విమర్శలు చేస్తోంది. జరిగే మైనింగ్ క్వారీలు నేను పుట్టక ముందు నుంచి ఉన్నాయి. దీంట్లో ఉమ హయాంలో అక్కడ ఎంత మైనింగ్ జరిగిందో మార్క్ చేస్తున్నాం. అత్యంత ఎక్కువ మైనింగ్ ఆయన హయాంలోనే జరిగింది. అక్కడి కాంట్రాక్టర్లును డబ్బుల కోసం బెదిరించాడు. ఆ తర్వాత ఫారెస్ట్ ల్యాండ్ అని బెదిరించి ఆపించాడు. ఆ తర్వాత మళ్లీ దాన్ని రెవెన్యూ ల్యాండ్ గా మార్పించింది ఉమానే.” అని కొడాలి నాని తీవ్రస్థాయిలో ఎదురు దాడికి దిగారు. రైతుల కష్టాన్ని దోచుకోవాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదని తేల్చి చెప్పిన మంత్రి, ఇలాంటి చంద్రబాబు, ఉమ లాంటి వారి మాటలు రైతులు నమ్మొద్దని కోరారు.

ఇలా ఉండగా, మాజీ మంత్రి దేవినేని ఉమ అక్రమ అరెస్టును ఖండిస్తూ నందివాడ పోలీస్ స్టేషన్ వద్ద టీడీపీ శ్రేణులు ఆందోళన నిర్వహించాయి. ఉమను విడుదల చేయాలంటూ పార్టీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ఎదుట నినాదాలు చేశారు. దేవినేని ఉమను చూపించాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీస్ స్టేషన్ దగ్గర భద్రతా బలగాలను భారీగా మోహరించారు.

Read also : Devineni Uma : దేవినేని ఉమ వర్సెస్ వసంత…! వాటీజ్ దిస్.? రాళ్ళ దాడి, అరెస్టులపై బీజేపీ నేత వ్యంగ్యం

81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!