AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మున్సిపాల్టీ ఎన్నికల్లో కొత్త జిల్లాల రగడ.. డిప్యూటీ స్పీకర్‌ కామెంట్స్‌తో కాగుతున్న కాంట్రవర్సీ

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా జిల్లాలను పునర్వ్యవస్థీకరించాలని..

మున్సిపాల్టీ ఎన్నికల్లో కొత్త జిల్లాల రగడ.. డిప్యూటీ స్పీకర్‌ కామెంట్స్‌తో కాగుతున్న కాంట్రవర్సీ
K Sammaiah
|

Updated on: Feb 22, 2021 | 5:26 PM

Share

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా జిల్లాలను పునర్వ్యవస్థీకరించాలని సీఎం జగన్‌ నిర్ణయించారు. ప్రతి పార్లమెంటు స్థానాన్ని జిల్లాగా మార్చేందుకు వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా బాపట్ల పార్లమెంటు నియోజకవర్గం స్థానంపై వివాదం నెలకొంది.

బాపట్ల పార్లమెంటు నియోజవకర్గం స్థానాన్ని జిల్లా గా మారుస్తూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఇంకా అధికారికంగా ప్రకటించకముందే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంట్రవర్సీ గా మారింది. బాపట్ల ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ కోనరఘుపతి బాపట్ల మున్సిపాలిటీ ని వైసీపీ అభ్యర్థులతో ఏకగ్రీవంగా ఎన్నిక చేసి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి బహుమతిగా ఇవ్వాలని, బాపట్ల జిల్లా సాధనకు సహకరించాలని కోరడం వివాదాస్పదం అయింది.

ఈ ప్రతిపాదన ప్రజాస్వామ్య విరుద్ధమని, ఎన్నికల్లో ప్రజల మనోభావాలను, హక్కులను గౌరవించాలని, అన్ని వార్డులలో తెదేపా పోటీ చేసి బాపట్ల మున్సిపాలిటీలో గెలుపు సాధించి తీరుతుందని టీడీపీ బాపట్ల ఇన్ ఛార్జ్ వేగేశిన నరేంద్ర వర్మ పేర్కొన్నారు. ఓటమి తప్పదని తెలిసి ఇలా ఏకగ్రీవాలు చేసుకుందామనడం సబబు కాదన్నారు. దమ్ముంటే ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని సవాల్‌ విసిరారు.

Read more:

సీఎం జగన్‌కు అండగా ఉంటేనే గ్రామాల అభివృద్ధి.. ప్రమాణస్వీకారోత్సవంలో ఎమ్మెల్యే రోజా