కేసీఆర్‌పై చంద్రబాబు తీవ్ర విమర్శలు
పెడన: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జీవితమంతా అబద్ధాలేనని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. హోదాపై అవిశ్వాస తీర్మానం పెడితే టీఆర్‌ఎస్ ఎందుకు మద్దతివ్వలేదని కేసీఆర్‌ను ప్రశ్నించారు. కృష్ణా జిల్లా పెడనలో నిర్వహించిన ఎన్నికల ప్రచార రోడ్ షోలో చంద్రబాబు మాట్లాడారు. సోనియా గాంధీ ప్రత్యేకహోదా ఇస్తామంటే ఆయన వ్యతిరేకించారని ఆరోపించారు. ఏపీకి హోదా ఇస్తే తెలంగాణకు కూడా ఇవ్వాలని కేసీఆర్ అన్నారని చంద్రబాబు ఆరోపించారు. హైదరాబాద్ ఆస్తుల్లో 58 శాతం వాటా ఇవ్వాలని సుప్రీంకోర్టు చెబితే కేంద్రం […]

పెడన: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జీవితమంతా అబద్ధాలేనని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. హోదాపై అవిశ్వాస తీర్మానం పెడితే టీఆర్‌ఎస్ ఎందుకు మద్దతివ్వలేదని కేసీఆర్‌ను ప్రశ్నించారు. కృష్ణా జిల్లా పెడనలో నిర్వహించిన ఎన్నికల ప్రచార రోడ్ షోలో చంద్రబాబు మాట్లాడారు. సోనియా గాంధీ ప్రత్యేకహోదా ఇస్తామంటే ఆయన వ్యతిరేకించారని ఆరోపించారు. ఏపీకి హోదా ఇస్తే తెలంగాణకు కూడా ఇవ్వాలని కేసీఆర్ అన్నారని చంద్రబాబు ఆరోపించారు. హైదరాబాద్ ఆస్తుల్లో 58 శాతం వాటా ఇవ్వాలని సుప్రీంకోర్టు చెబితే కేంద్రం సహకారంతో కేసీఆర్ అడ్డుపడ్డారన్న బాబు.. జగన్ పార్టీకి వెయ్యి కోట్లు పంపించి ఏపీకి లక్ష కోట్లు ఎగ్గొట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. జగన్.. కేసీఆర్‌తో కలిసి నాటకాలు ఆడుతున్నారని.. కేసీఆర్ తనపై పెత్తనం చేయాలనుకుంటున్నారని బాబు చెప్పారు.
