AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మోదీ కేబినెట్లో మిత్రపక్షాలు !

నరేంద్ర మోదీ కొత్త మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు దక్కనుంది ? బీజేపీ మిత్ర పక్షాల్లోని పాపులర్ నేతలకు ఆయన ప్రాధాన్యం ఇవ్వవచ్చు అయితే ఈ ఎంపిక తులనాత్మకంగా ఉంటుందని, సమర్థులైన వారికే పదవులు దక్కవచ్చునని తెలుస్తోంది. ప్రధానంగా బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాను మంత్రివర్గంలోకి తీసుకుంటారని,, ఆయన స్థానే పార్టీ పగ్గాలను కేంద్ర మంత్రి నడ్డాకు అప్పగించవచ్ఛు నని వార్తలు వఛ్చిన సంగతి తెలిసిందే. అయితే వీటిని పార్టీ వర్గాలు అధికారికంగా ధృవీకరించలేదు. బుధవారం కూడా మోదీ […]

మోదీ  కేబినెట్లో మిత్రపక్షాలు !
Anil kumar poka
|

Updated on: May 30, 2019 | 11:35 AM

Share

నరేంద్ర మోదీ కొత్త మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు దక్కనుంది ? బీజేపీ మిత్ర పక్షాల్లోని పాపులర్ నేతలకు ఆయన ప్రాధాన్యం ఇవ్వవచ్చు అయితే ఈ ఎంపిక తులనాత్మకంగా ఉంటుందని, సమర్థులైన వారికే పదవులు దక్కవచ్చునని తెలుస్తోంది. ప్రధానంగా బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాను మంత్రివర్గంలోకి తీసుకుంటారని,, ఆయన స్థానే పార్టీ పగ్గాలను కేంద్ర మంత్రి నడ్డాకు అప్పగించవచ్ఛు నని వార్తలు వఛ్చిన సంగతి తెలిసిందే. అయితే వీటిని పార్టీ వర్గాలు అధికారికంగా ధృవీకరించలేదు. బుధవారం కూడా మోదీ , అమిత్ షా చాలాసేపు భేటీ అయి..మంత్రివర్గ కూర్పుపై చర్చించారు. వీరి భేటీలో… తన ఆరోగ్య కారణాల రీత్యా తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టలేనంటూ అరుణ్ జైట్లీ… మోదీకి రాసిన లేఖ ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చింది. అంతకుముందు జైట్లీతో మోదీ సమావేశమై ఆయన ఆరోగ్య పరిస్థితిని గురించి అడిగి తెలుసుకున్నారు. వీరి సమావేశ పూర్తి వివరాలు వెల్లడి కానప్పటికీ.. జైట్లీ కోర్కెను మోదీ మన్నించవచ్ఛునని తెలుస్తోంది. అటు-బీజేపీ అధ్యక్షునిగా అమిత్ షా ను కొనసాగించాలని ఆర్ ఎస్ ఎస్ గట్టిగా కోరుతోంది. కొన్ని రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించాలంటే ఆయన నాయకత్వం అత్యంత అవసరమని ఈ సంస్థ వర్గాలు భావిస్తున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో పార్టీ ఘన విజయానికి అమిత్ షా రూపొందించిన వ్యూహం అద్భుత ఫలితాలనిచ్చిన విషయాన్నిఆర్ ఎస్ ఎస్ నేతలు గుర్తు చేస్తున్నారు. కాగా-హోమ్ మంత్రి రాజ్ నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ శాఖలను మోదీ అలాగే కొనసాగించవచ్చు. ఇటీవలి ఎన్నికల్లో సుష్మా స్వరాజ్ పోటీ చేయలేదు. దీంతో ఆమెను రాజ్యసభకు పంపవచ్ఛునని సమాచారం. ఇక తెలంగాణాలో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచిన కిషన్ రెడ్డిని కేబినెట్లోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే దక్షిణాది నేతకొకరికి ఆయన ప్రాధాన్యం ఇఛ్చినట్టవుతుంది. కొంతమంది పాత ముఖాలతో బాటు కొందరు కొత్త వారిని కూడా మోదీ ‘ కరుణించే ‘ సూచనలు కనిపిస్తున్నాయి. వీరిలో ప్రధానంగా యూపీ, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలకు చెందినవారున్నారు. ఈ రాష్ట్రాల్లో అధికార పార్టీలను చావుదెబ్బ తీసిన తమ పార్టీ ఎంపీలకు రెండో సారి ప్రధాని కాబోతున్న మోదీ ఛాన్స్ ఇఛ్చినట్టవుతుంది. 60 మందితో మోదీ జంబో కేబినెట్ ఏర్పాటు కానుందని సమాచారం. గురువారం సాయంత్రం 7 గంటలకు మోదీ చేత రాష్ట్రపతి కోవింద్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సుమారు ఎనిమిదివేలమంది హాజరవుతున్నారని అంచనా.