కాంగ్రెస్ షాకింగ్ నిర్ణయం.. ఇకపై నెల పాటు…

సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం చవిచూసిన విషయం తెలిసిందే. కనీసం ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేని పరిస్థితి ఏర్పడింది. అయితే ఓటమిపై పార్టీ విశ్లేషించుకునే పనిలో పడింది. కాగా మరోవైపు పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ రాజీనామాపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. నెల రోజుల పాటు మీడియా ఛానళ్లు నిర్వహించే చర్చల్లో పాల్గొనవద్దని నిర్ణయించింది. పార్టీ అధికార ప్రతినిధులు, పార్టీ నాయకులు నెలరోజులపాటు […]

కాంగ్రెస్ షాకింగ్ నిర్ణయం.. ఇకపై నెల పాటు...
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: May 30, 2019 | 10:40 AM

సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం చవిచూసిన విషయం తెలిసిందే. కనీసం ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేని పరిస్థితి ఏర్పడింది. అయితే ఓటమిపై పార్టీ విశ్లేషించుకునే పనిలో పడింది. కాగా మరోవైపు పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ రాజీనామాపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. నెల రోజుల పాటు మీడియా ఛానళ్లు నిర్వహించే చర్చల్లో పాల్గొనవద్దని నిర్ణయించింది. పార్టీ అధికార ప్రతినిధులు, పార్టీ నాయకులు నెలరోజులపాటు టీవీ వార్తా చానళ్లు నిర్వహిస్తున్న చర్చలకు వెళ్లవద్దని కాంగ్రెస్ పార్టీ కమ్యూనికేషన్ల విభాగం ఇన్‌చార్జి రణదీప్ సింగ్ సూర్జేవాలా ట్వీట్ చేశారు. అలాగే మీడియా కూడా అందుకు సహకరించాలని.. చర్చలకు పార్టీ ప్రతినిధులను ఆహ్వానించొద్దని విజ్ఞప్తి చేశారు. రాహుల్‌ గాంధీ రాజీనామాపై ఓ వైపు ఉత్కంఠ కొనసాగుతన్న నేపథ్యంలో.. పార్టీ నుంచి ఇలాంటి నిర్ణయం వెలువడడం ప్రాధాన్యం సంతరించుకుంది.