అమిత్ షా నుంచి ఎవరెవరికి ఫోన్లు ?

మోదీ కొత్త కేబినెట్లో ఎవరెవరికి చోటు దక్కనుందో స్పష్టమైంది. వీరిని గురువారం సాయంత్రం 5 గంటలకు మోడీ నివాసానికి చేరుకోవాలని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కోరారు. ఆయన నుంచి వీరికి ఫోన్లు వెళ్లాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం, స్మృతి ఇరానీ, నిర్మలా సీతారామన్, కిరణ్ రిజ్జు , రవిశంకర్ ప్రసాద్, ప్రకాష్ జవదేకర్, పీయూష్ గోయెల్, రామ్ దాస్ అథవాలే, జితేందర్ సింగ్, సురేష్ అంగడి, కైలాష్ చౌదరి, జి.కిషన్ రెడ్డి, ప్రహ్లాద్ జోషీ, అరవింద్ […]

అమిత్ షా నుంచి ఎవరెవరికి ఫోన్లు ?
Follow us

| Edited By:

Updated on: May 30, 2019 | 7:17 PM

మోదీ కొత్త కేబినెట్లో ఎవరెవరికి చోటు దక్కనుందో స్పష్టమైంది. వీరిని గురువారం సాయంత్రం 5 గంటలకు మోడీ నివాసానికి చేరుకోవాలని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కోరారు. ఆయన నుంచి వీరికి ఫోన్లు వెళ్లాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం, స్మృతి ఇరానీ, నిర్మలా సీతారామన్, కిరణ్ రిజ్జు , రవిశంకర్ ప్రసాద్, ప్రకాష్ జవదేకర్, పీయూష్ గోయెల్, రామ్ దాస్ అథవాలే, జితేందర్ సింగ్, సురేష్ అంగడి, కైలాష్ చౌదరి, జి.కిషన్ రెడ్డి, ప్రహ్లాద్ జోషీ, అరవింద్ సావంత్ తదితరులు ఫోన్లు అందుకున్నవారిలో ఉన్నారు. వీరిలో అందుబాటులో ఉన్న పలువురు అప్పుడే మోదీ నివాసానికి చేరుకున్నారు. గురువారం ఉదయం 11 గంటలకు మోదీ , అమిత్ షా ప్రత్యేకంగా భేటీ అయి..కేబినెట్ కూర్పుపై చర్చించారు. ఇప్పటికే స్థూలంగా ఆమోదించిన తొలి జాబితాపై వీరు కసరత్తు చేశారు. మంత్రివర్గ ఏర్పాటులో మోదీ పూర్తిగా అమిత్ షా వ్యూహంపై ఆధారపడడం విశేషం. ఎన్నికల్లో పార్టీని విజయపథాన నడిపించిన షా.. అపర చాణక్య నీతికి మోదీ ‘ ఫిదా ‘ అయినట్టేనని విశ్లేషకులు భావిస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయన అమిత్ షా రాజకీయ చతురతపై ఆధారపడక తప్పని పరిస్థితి ఏర్పడింది. ప్రత్యర్థి పార్టీని అదేపనిగా విమర్శించకుండా, వ్యక్తిగత ఆరోపణలకు దిగకుండా .. తాము చేసిన అభివృద్ద్ధిని మాత్రమే ప్రజల హృదయాల్లో చొచ్ఛుకు వెళ్లేలా అమిత్ షా చేసిన ప్రచార సరళి బీజేపీ ఘన విజయానికి దోహదపడింది. ఆప్ అధికారంలో ఉన్న ఢిల్లీలో ఏడు పార్లమెంటు నియోజకవర్గాలనూ బీజేపీ కైవసం చేసుకోవడం విశేషం.

Also Read: లైవ్ అప్‌డేట్స్ : ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం