ప్రొటెం స్పీకర్‌గా మేనకాగాంధీ

17వ లోక్‌సభకు ప్రోటెం స్పీకర్‌గా మేనకాగాంధీ వ్యవహరించనున్నారు. ఈ సారి ఆమెకు మోదీ మంత్రి వర్గంలో చోటు దక్కలేదు. ఈ సారి ఎన్నికైన ఎంపీలతో ఆమె ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ సభ తొలి సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. అనంతరం ఈ సమావేశంలోనే కొత్త స్పీకర్‌ను ఎన్నుకుంటారు. కాగా, లోక్‌సభలో సీనియర్ అయిన సంతోష్ గంగ్వార్ పేరు కూడా వినపడుతోంది. మొత్తానికి వీరిద్దరిలో ఎవరో ఒకరు ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించనున్నారు.

  • Tv9 Telugu
  • Publish Date - 7:58 am, Fri, 31 May 19