అమిత్‌షా ర్యాలీలో చెలరేగిన హింస

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో మంగళవారం బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా నిర్వహిస్తున్న మెగా ర్యాలీలో ఘర్షణ చెలరేగింది. ఆయన నిర్వహిస్తున్న ర్యాలీకి పెద్ద ఎత్తున ప్రజలు వచ్చారు. బీజేపీకు అనుకూలంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. ఈ సమయంలో అమిత్‌ షా కాన్వాయ్‌పైకి గుర్తు తెలియని వ్యక్తులు కొందరు కర్రలు, రాళ్లు విసిరేయడంతో భాజపా కార్యకర్తలు ఆగ్రహంతో ఊగిపోయారు. రోడ్డు పక్కన ఉన్న వాహనాలకు కొందరు నిప్పు అంటించారు. తృణమూల్‌ కాంగ్రెస్‌, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ […]

అమిత్‌షా ర్యాలీలో చెలరేగిన హింస
Follow us

|

Updated on: May 14, 2019 | 8:46 PM

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో మంగళవారం బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా నిర్వహిస్తున్న మెగా ర్యాలీలో ఘర్షణ చెలరేగింది. ఆయన నిర్వహిస్తున్న ర్యాలీకి పెద్ద ఎత్తున ప్రజలు వచ్చారు. బీజేపీకు అనుకూలంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. ఈ సమయంలో అమిత్‌ షా కాన్వాయ్‌పైకి గుర్తు తెలియని వ్యక్తులు కొందరు కర్రలు, రాళ్లు విసిరేయడంతో భాజపా కార్యకర్తలు ఆగ్రహంతో ఊగిపోయారు. రోడ్డు పక్కన ఉన్న వాహనాలకు కొందరు నిప్పు అంటించారు. తృణమూల్‌ కాంగ్రెస్‌, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగడంతో పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. ఇరు వర్గాల కార్యకర్తలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నట్లు తెలుస్తోంది.

అమిత్‌ షా ర్యాలీ కోల్‌కతా విశ్వవిద్యాలయం వద్దకు చేరుకోగానే ఈ ఘర్షణలు చెలరేగాయి. ఆయన కాన్వాయ్‌పైకి కాలేజీ హాస్టల్‌ నుంచి కొందరు రాళ్లు రువ్వినట్లు తెలుస్తోంది. దీంతో ఆ భవనం ముందు భీజేపీ కార్యకర్తలు విధ్వంసానికి పాల్పడ్డారు.