AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు సిద్ధం: ద్వివేది

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈనెల 11న జరగనున్న పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేశామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. రేపు సాయంత్రానికల్లా ఎన్నికల ప్రచారం ముగించాలని రాజకీయ పార్టీలకు స్పష్టం చేశారు. పోలింగ్ సిబ్బందిని తరలించడానికి 7,600 బస్సులను సిద్ధం చేశామన్నారు. 10వ తేదీన మధ్యాహ్నం నుంచే సిబ్బందిని పోలింగ్ కేంద్రాలకు తరలిస్తామన్నారు. 9 వేలకు పైగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని ద్వివేది తెలిపారు. సమస్యాత్మక కేంద్రాల వద్ద కేంద్ర బలగాలతో […]

పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు సిద్ధం: ద్వివేది
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 08, 2019 | 7:28 PM

Share

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈనెల 11న జరగనున్న పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేశామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. రేపు సాయంత్రానికల్లా ఎన్నికల ప్రచారం ముగించాలని రాజకీయ పార్టీలకు స్పష్టం చేశారు. పోలింగ్ సిబ్బందిని తరలించడానికి 7,600 బస్సులను సిద్ధం చేశామన్నారు. 10వ తేదీన మధ్యాహ్నం నుంచే సిబ్బందిని పోలింగ్ కేంద్రాలకు తరలిస్తామన్నారు. 9 వేలకు పైగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని ద్వివేది తెలిపారు. సమస్యాత్మక కేంద్రాల వద్ద కేంద్ర బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఓటరు గుర్తింపు కార్డులు, ఓటర్ స్లిప్పుల పంపిణీ రేపటికల్లా పూర్తి చేస్తామన్నారు. ఓటర్ గుర్తింపు కార్డు లేకున్నా.. 11 గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి చూపి ఓటు వేయొచ్చని స్పష్టం చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటుచేశామని తెలిపారు.

Follow Us