హైదరాబాద్ ఎంపీ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన అసదుద్దీన్ ఓవైసీ
హైదరాబాద్ : హైదరాబాద్ లోక్‌సభ స్థానానికి మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారిగా ఉన్న హైదరాబాద్ కలెక్టర్ మాణిక్‌రాజ్ కన్నన్‌కు నామినేషన్ పత్రాలను ఓవైసీ సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 2009, 2014 సాధారణ ఎన్నికల్లో హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి అసదుద్దీన్ ఓవైసీ పోటీ చేసి గెలుపొందారు. కాగా ఈ నెల 25వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 […]
హైదరాబాద్ : హైదరాబాద్ లోక్‌సభ స్థానానికి మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారిగా ఉన్న హైదరాబాద్ కలెక్టర్ మాణిక్‌రాజ్ కన్నన్‌కు నామినేషన్ పత్రాలను ఓవైసీ సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 2009, 2014 సాధారణ ఎన్నికల్లో హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి అసదుద్దీన్ ఓవైసీ పోటీ చేసి గెలుపొందారు. కాగా ఈ నెల 25వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 26న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు ఈ నెల 28 వరకు ఉంది. లోక్‌సభ ఎన్నికలకు ఏప్రిల్ 11న పోలింగ్ జరగనుంది. అనంతరం మే21న ఫలితాలు వెలువడనున్నాయి.