అనుకున్నట్టే బీజేపీలో చేరిన మిథున్ చక్రవర్తి, డిస్కో డ్యాన్సర్ స్టార్ కాంపెయినర్ అవుతారా ?

అనుకున్నట్టే బెంగాలీ, బాలీవుడ్  నటుడు మిథున్ చక్రవర్తి ఆదివారం బీజేపీలో చేరారు. కోల్ కతా లోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన భారీ ర్యాలీలో ఆయన ఈ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

  • Umakanth Rao
  • Publish Date - 2:55 pm, Sun, 7 March 21
అనుకున్నట్టే బీజేపీలో చేరిన మిథున్ చక్రవర్తి, డిస్కో డ్యాన్సర్ స్టార్ కాంపెయినర్ అవుతారా ?

అనుకున్నట్టే బెంగాలీ, బాలీవుడ్  నటుడు మిథున్ చక్రవర్తి ఆదివారం బీజేపీలో చేరారు. కోల్ కతా లోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన భారీ ర్యాలీలో ఆయన ఈ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. బెంగాల్ లో బీజేపీ వ్యవహారాల ఇన్-ఛార్జ్ కైలాష్ విజయ్ వర్గీయ, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. నిన్న విజయ్ వర్గీయ హుటాహుటిన వెళ్లి మిథున్ చక్రవర్తి పార్టీలో చేరికకు మార్గాన్ని సుగమం చేశారు. అంతవరకు మిథున్ అసలు బీజేపీలో చేరుతారా లేక తృణమూల్ కాంగ్రెస్ లో మళ్ళీ కాలు మోపుతారా అన్న సందేహాలు కొనసాగాయి. ఇటీవల ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ముంబైలో మిథున్ ఇంటికి వెళ్లి ఆయనతో సుమారు 2 గంటలపాటు చర్చలు  జరిపారు కూడా.. కాగా  బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ లో జరిగే ర్యాలీలో ప్రధాని మోదీతో బాటు  మిథున్ వేదికనలంకరిస్తారని వార్తలు వచ్చాయి. ప్రధాని ఇంకా రాక ముందే డిస్కో డ్యాన్సర్ ఇక్కడికి చేరుకున్నాడు. ఆయనకు బీజేపీ నేతలు, అభిమానుల నుంచి ఘన స్వాగతం లభించింది.

70 ఏళ్ళ మిథున్ కి బెంగాల్ లో వేలాది అభిమానులున్నారు. బెంగాలీ సినిమాల్లో నటించడమే కాదు.. పలు టీవీ షోలకు ఆయన న్యాయనిర్ణేతగా కూడా వ్యవహరించాడు. లోగడ శారదా చిట్ ఫండ్ స్కామ్ లో మిథున్ పేరు కూడా బయటకువచ్చింది. రూ.1,2 కోట్ల సొమ్ముకు సంబంధించిన అవకతవకల్లో ఈయన ప్రమేయముందని ఆరోపణలు వచ్చ్చాయి. ఈ కేసులో ఆయనను ఈడీ విచారించింది. అయితే ఈ సొమ్మును ఆయన ఈడీ కి అప్పగించేశారు. అప్పట్లో తృణమూల్ కాంగ్రెస్ లో ఉన్న మిథున్ ని ఆ పార్టీ రాజ్యసభకు పంపింది. కానీ ఆరోగ్య కారణాలు చూపి రెండేళ్ల అనంతరం రాజీనామా చేసారు. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చాడు. ఇప్పుడిక బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ ఈయనకు అభ్యర్థిగా టికెట్ ఇస్తుందా లేక స్టార్ కాంపెయినర్ గా ఈయన సేవలను వినియోగించుకుంటుందా అన్నది వేచి చూడాల్సి ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి:

Giriraj Singh : ప్రభుత్వాధికారులు, ప్రజాప్రతినిధులు సమస్యలు పట్టించుకోకపోతే వెదురు కర్రలతో చితక్కొట్టండి : కేంద్ర మంత్రి

Priyanka Arul Mohan : అదిరిపోయే ఆఫర్ అందుకున్న నాని హీరోయిన్.. ఏకంగా సూపర్ స్టార్ సరసన…