తమిళనాడులో ప్రచారానికి శ్రీకారం చుట్టిన హోంమంత్రి అమిత్ షా, కన్యాకుమారి ఆలయంలో పూజలు

హోం మంత్రి అమిత్ షా తమిళనాట ప్రచారానికి శ్రీకారం చుట్టారు.  తమ పార్టీ చేబట్టిన 'విజయ్ సంకల్ప్ మహాసంకల్ప్ అభియాన్'  లోభాగంగా ఆదివారం ఆయన కన్యాకుమారి చేరుకొని ఇంటింటి ప్రచారం ప్రారంభించారు.

తమిళనాడులో ప్రచారానికి శ్రీకారం చుట్టిన హోంమంత్రి అమిత్ షా, కన్యాకుమారి ఆలయంలో పూజలు
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Mar 07, 2021 | 7:53 PM

హోం మంత్రి అమిత్ షా తమిళనాట ప్రచారానికి శ్రీకారం చుట్టారు.  తమ పార్టీ చేబట్టిన ‘విజయ్ సంకల్ప్ మహాసంకల్ప్ అభియాన్’  లోభాగంగా ఆదివారం ఆయన కన్యాకుమారి చేరుకొని ఇంటింటి ప్రచారం ప్రారంభించారు. ఇక్కడ మొదట సుచీన్ద్రం ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తొలిదశలో 11 ఇళ్లల్లో ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. తమిళనాడులో జరగనున్న ఎన్నికల్లో అన్నా డీఎంకే- బీజేపీ-పీఎంకె కూటమి గెలిచి  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న విశ్వాసం తనకు ఉందన్నారు.  కన్యాకుమారి లోక్ సభ ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ పోటీ చేస్తున్న విషయం గమనార్హం. ఇక్కడ కాంగ్రెస్ సిటింగ్ ఎంపీ వసంత్ కుమార్ మృతితో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. 2019 లో ఈయన చేతిలో  ఇక్కడ బీజేపీ అభ్యర్థి ఓడిపోయారు.  ఈ ఉప ఎన్నికలో ఎన్డీయే అభ్యర్థి, మాజీ మంత్రి పొన్ రాధాకృష్ణన్ విజయానికి తోడ్పడాలని అమిత్ షా ఓటర్లను కోరారు.

ఇలా ఉండగా తమిళనాడు ఎన్నికల్లో అన్నాడీఎంకే, బీజేపీ మధ్య  సీట్ల  సర్దుబాటు కుదిరిన సంగతి తెలిసిందే. బీజేపీకి 20 సీట్లు కేటాయించేందుకు అన్నాడీఎంకే అంగీకరించింది. ఇప్పటికే ఈ ప్రధాన పార్టీలు ప్రచార సన్నాహాలకు విస్తృత కార్యాచరణను రూపొందించాయి. తమిళనాడు ఎన్నికలు ఒకే దశలో జరగనున్నాయి. అమిత్ షా ఇక్కడ పర్యటన ముగించుకున్న అనంతరం కేరళ రాష్ట్రానికి బయల్దేరి వెళ్లనున్నారు.  తిరువనంతపురంలో తమ  పార్టీ విజయ యాత్ర ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు.

ఇలా ఉండగా ఆశ్చర్యకరంగా కన్యా కుమారి లోక్ సభ స్థానానికి తమ పార్టీ నేత ప్రియాంక గాంధీకి టికెట్ ఇవ్వాలని కోరుతూ ఈ పార్టీ నేత కార్తీ చిదంబరం దరఖాస్తు పెట్టడం విశేషం.అయితే ఆ దరఖాస్తును పార్టీ పరిగణనలోకి తీసుకుందా లేదా అన్నది ఇంకా తెలియడంలేదు.

మరిన్ని ఇక్కడ చదవండి:

Photo Gallery: ‘ఉత్తమ గోపాలక్’ అవార్డు అందుకున్న ధోని.. ఎక్కడైనా ‘మహీ’ అత్యుత్తమమే…

ప్రతిపక్షాలతో చెడుగుడు.. ఫన్ కోసం కబడ్డీ.. ఏ ఆటలోనైనా తగ్గేది లేదంటున్న ఎమ్మెల్యే రోజా.. హల్‌చల్ చేస్తోన్న వీడియో..