గుంటూరు వెస్ట్ బరిలో అత్యధికంగా 34 మంది పోటీ!
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ ఎన్నికల సమరం చివరి దశకు చేరుకుంది. ప్రచారానికి మంగళవారం సాయంత్రం 5 గంటలతో గడువు ముగియనుంది. గురువారం జరిగే పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. రాజకీయ పార్టీలు ఎవరికి వారు తమ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఏపీలో అత్యధికంగా అభ్యర్థులు బరిలో ఉన్న నియోజకవర్గంగా గుంటూరు వెస్ట్ నిలిచింది. గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో టీడీపీ తరపున మాదాల గిరి, వైసీపీ నుంచి ఏసురత్నం, జనసేన తరపున విశ్రాంత ఐఏఎస్ […]

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ ఎన్నికల సమరం చివరి దశకు చేరుకుంది. ప్రచారానికి మంగళవారం సాయంత్రం 5 గంటలతో గడువు ముగియనుంది. గురువారం జరిగే పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. రాజకీయ పార్టీలు ఎవరికి వారు తమ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఏపీలో అత్యధికంగా అభ్యర్థులు బరిలో ఉన్న నియోజకవర్గంగా గుంటూరు వెస్ట్ నిలిచింది.
గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో టీడీపీ తరపున మాదాల గిరి, వైసీపీ నుంచి ఏసురత్నం, జనసేన తరపున విశ్రాంత ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్, బీజేపీ నుంచి సినీ హీరోయిన్ మాధవీలత తదితరులు పోటీ చేస్తున్నారు. ఇతర పార్టీలు, ఇండిపెండెంట్లు కలిపి మొత్తం 34 మంది బరిలో ఉన్నారు. దీని తర్వాత స్థానాల్లో మంగళగిరి(32), కర్నూలు(28), గుంటూరు ఈస్ట్(27) ఉన్నాయి. విజయవాడ వెస్ట్‌లో 22, చంద్రగిరిలో 22, కందుకూరులో 20, మదనపల్లెలో 19, బాపట్లలో 19, చిలకలూరిపేటలో 19, మైలవరంలో 18, విజయవాడ సెంట్రల్‌లో17 మంది బరిలో ఉన్నారు. జనసేన అధినేత పవన్ పోటీచేస్తున్న భీమవరంలో 13 మంది, గాజువాకలో 12 మంది బరిలో ఉన్నారు.



