Breaking News
  • తెలుగు రాష్ట్రాలకు రూ.10లక్షలు విరాళం. మలికిపురం మండలం మట్టపర్రు సొంత గ్రామానికి తనవంతు సహాయంగా 5లక్షలు అందజేత.. తన కుటుంబ సభ్యుల ద్వారా తన గ్రామంలో రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికీ వెయ్యి రూపాయల చొప్పున పంపిణీ.. కరోనా వైరస్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని పిలుపు..
  • న్యూఢిల్లీ: కరోనా వైరస్ పై జరుగుతున్న యుద్ధంలో విజయం సాధించాలంటే ప్రజల సహకారం మరింత అవసరమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి.
  • కాశ్మీర్ లోయలో ఒక్కరోజులోనే 7 కొత్త కరోనా కేసుల నమోదు. శ్రీనగర్‌లో విదేశాలకు వెళ్లొచ్చిన ముగ్గురికి, మతపరమైన ప్రార్థనలకు హాజరైన నలుగురికి కరోనా పాజిటివ్. పాజిటివ్ కేసుల కాంటాక్ట్ ట్రేసింగ్ మొదలు పెట్టిన అధికారులు.
  • విజయనగరం : టివి9 సమచారంతో స్పందించిన విశాఖ రీజియన్ డిఐజి కాళిదాసు రంగారావు ఏపి చెన్నై బోర్డర్ అధికారులతో పాటు చైన్నై కి చెందిన పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడిన డిఐజి విజయనగరం జిల్లాకు చెందిన వారికి మౌలిక సదుపాయాలు కల్పించాలని విన్నపం బాధితులతో మాట్లాడిన రంగారావు.
  • సూర్యాపేట: మోతె మండలం రాఘవ పురం,నామవరం గ్రామాల్లో దళిత కాలనిలో ఇంటి ఇంటికి తిరిగి కూరగాయలు పంపిణీ చేసిన ఎంపీపీ మీ ఆశా శ్రీకాంత్ రెడ్డి. పంచిన ఎంపీపీ ఆశశ్రీకాంత్ రెడ్డి, పాల్గొన్న సర్పంచ్ లు,ఆశా వర్కర్లు, పోలీస్ సిబ్బంది.
  • కరోనా మహమ్మారి ప్రభావం వివిధ రంగాలపై తీవ్రంగా పడింది. దీని బారి నుంచి ప్రజలను కాపాడటానికి ఇప్పటికే హీరోల నుంచి సినీ నిర్మాతల నుంచి , దర్శకుల నుంచి విరాళాలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ సంక్షోభం నుంచి సినిమా రంగాన్ని బయటపడేయటానికి సినీ ప్రముఖులు కంకణం కట్టుకున్నారు.
  • తెలంగాణలో లాక్‌డౌన్‌ ఉన్నా కొంతమంది ఖాతరు చేయడం లేదు. అడ్డదారుల్లో రాష్ట్ర సరిహద్దులు దాటేందుకు ప్రయత్నిస్తున్నారు. కంటైనర్‌లో వందల మంది ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రయత్నం చేయగా.. పోలీసులు అడ్డుకున్నారు.
  • కరోనా పిశాచి అంతకంతకూ కోరలు చాస్తూ విలయతాండవం చేస్తోంది.. అగ్రరాజ్యం అమెరికా సైతం కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేయలేకపోతోంది. అక్కడ ఒక్కరోజే 18 వేల కొత్త కేసులు నమోదయ్యాయి.

Singer Suicide: వరకట్న వేధింపులు.. ప్రముఖ సింగర్ ఆత్మహత్య..!

playback singer suicide, Singer Suicide: వరకట్న వేధింపులు.. ప్రముఖ సింగర్ ఆత్మహత్య..!

వరకట్నం వేధింపులు తాళలేక ప్రముఖ సింగర్ ఆత్మహత్య చేసుకొని తనువు చాలించింది. గత కొన్ని రోజులు క్రితం తన తల్లిదండ్రుల ఇంటికి వచ్చిన ఆ సింగర్.. ఆదివారం రాత్రి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. కన్నడలో పలు చిత్రాల్లో పాటలు పాడి మంచి క్రేజ్ సంపాదించుకుంది సింగర్ సుస్మితా రాజె(26). ఆమెకు ఏడాదిన్నర క్రితం శరత్ కుమార్ అనే వ్యక్తితో వివాహమైంది. మొదట్లో అత్తింటి వారు బాగానే చూసుకున్నప్పటికీ.. ఆ తరువాత వరకట్న వేధింపులు చేయడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కొన్ని రోజులు క్రితం పుట్టింటికి వచ్చింది సుస్మిత. ఇక ఆదివారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో తన తల్లి, సోదరుడు సచిన్‌కి మెసేజ్ చేసిన సుస్మిత గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

playback singer suicide, Singer Suicide: వరకట్న వేధింపులు.. ప్రముఖ సింగర్ ఆత్మహత్య..!

ఉదయం 5.30గం.లకు నిద్ర లేచిన సచిన్.. ఆ మెసేజ్ చూసిన వెంటనే ఆమె గదికి వెళ్లాడు. అయితే ఆలోపే సుస్మిత చనిపోయింది. వెంటనే ఆమె సోదరుడు పోలీసులకు సమాచారం అందించగా.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కాగా అదనపు కట్నం కావాలంటూ అత్తింటి వారు చేస్తోన్న వేధింపుల కారణంగానే తాను ఆత్మహత్య చేసుకున్నానని సుస్మిత సూసైడ్ నోట్‌లో పేర్కొంది. భర్త శరత్, అత్త వైదేహీ, భర్త సోదరి గీత తనను వేధిస్తున్నారని ఆమె అందులో తెలిపింది.

playback singer suicide, Singer Suicide: వరకట్న వేధింపులు.. ప్రముఖ సింగర్ ఆత్మహత్య..!

Related Tags