- Telugu News Photo Gallery You cannot imagine how many changes will happen in your body with Cardamom, Check Here is Details
Cardamom: చిన్న యాలిక్కాయతో మీ శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో ఊహించలేరు..
వంటింట్లో ఉండే దివ్య ఔషధాల్లో యాలకులు కూడా ఒకటి. యాలకులను చాలా రకాల వంటల్లో ఉపయోగిస్తూ ఉంటారు. ఇందులో అనేక పోషకాలు లభిస్తాయి. ఎన్నో వ్యాధులను కంట్రోల్ చేసి.. రోగ నిరోధక శక్తిని పెంచడంలో యాలకులు ఎంతో చక్కగా హెల్ప్ చేస్తాయి..
Updated on: Jan 04, 2025 | 9:51 PM

యాలకుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వంటింట్లో దొరికే అద్భుతమైన ఔషధాల్లో యాలకులు కూడా ఒకటి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బాడీని కూడా డీటాక్సీఫై చేస్తుంది.

యాలకులు శరీర జీవక్రియలను నెమ్మదిగా పెంచుతాయి. వీటిలో ఉండే థర్మోజెనిక్ గుణాలు శరీరంలో క్యాలరీలను సమర్థంగా కరిగించేస్తాయి. రాత్రివేళ యాలకులు తింటే బరువు తగ్గడానికి కూడా మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

యాలకులలో ఉండే డైయూరెటిక్ గుణాలు ఉంటాయి. దీంతో శరీరంలో పేరుకున్న మలినాలు బయటికి వెళ్లిపోతాయి. అలా కిడ్నీల ఆరోగ్యానికి అండగా నిలుస్తాయి. శరీరానికి ఉన్న సహజ డిటాక్స్ క్రమాన్ని మెరుగుపరుస్తాయి.

రాత్రి వేళ యాలకులు నమిలితే నోటి దుర్వాసన దూరమవుతుంది. దంతాలు, చిగుళ్లకు హానికరమైన బ్యాక్టీరియా నుంచి రక్షణ లభిస్తుంది. యాలకుల సుగంధం మనసుకు ప్రశాంతత చేకూరుస్తుంది. ఒక కప్పు యాలకుల టీ తాగితే శరీరంలో స్ట్రెస్ హార్మోన్ కార్టిసోల్ స్థాయులు తగ్గుతాయి. అలా ఒత్తిడి నుంచి ఉపశమనం దొరుకుతుంది.

యాలకులతో జీర్ణ వ్యవస్థకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. తిన్న తర్వాత కడుపు ఉబ్బరంగా అనిపిస్తే రెండు యాలకులు నోట్లో వేసుకుని నమిలితే చాలు.. సత్వర ఉపశమనం లభిస్తుంది. ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు యాలకులు తింటే గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి పొట్ట సమస్యలు తగ్గిపోతాయిని నిపుణులు చెబుతున్నారు.




